ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల(TOSS)
*ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల*
హైదరాబాద్ : ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పరీక్షా ఫీజు కట్టిన విద్యార్థులందరినీ పాస్ చేసినట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల 42,644 మంది ఎస్సెస్సీ, 30,733 మంది ఇంటర్ విద్యార్థులకు లాభం చేకూరింది. విద్యార్థులందరికీ ప్రతి సబ్జెక్టులో పాస్ మార్కులు 35 ఇచ్చారు. ఫలితాల కోసం కింది వెబ్‌సైట్‌ను చూడొచ్చు.*