Kendriya vidyalaya admissions 2020-21
*📚✍కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు వేళాయే....
⭕కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. 2020-21 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 20 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఏడాది కరోనాతో ప్రవేశాలకు నోటిఫికేషన్‌లోనే తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. కరోనా వైరస్ తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటే సెప్టెంబరు 15 నుంచి తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
*♦ఏడో తేదీ వరకు గడువు*
ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 20వ తేదీ ఉదయం 10 నుంచి వచ్చేనెల 7వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంది. రెండో తరగతితో పాటు ఇతర తరగతుల్లో ఖాళీలను ఈనెల 20, 25వ తేదీ లోపు గుర్తిస్తారు. ఈ ఆరు రోజుల్లోనే రెండు నుంచి పదో తరగతిలోపు ప్రవేశాలకు వివరాల్ని విద్యార్థులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 30వ తేదీ నుంచి వచ్చే నెల 7లోపు ఆఫ్‌లైన్‌లోనే ఖాళీలు భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత ధ్రువపత్రాలు విద్యార్థులకు మంజూరు చేసిన వారం రోజుల్లోపే ఇంటర్‌లో ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.
*♦నాలుగు ప్రాధమ్యాలు*
ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో పనిచేసేవారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర అనుబంధ సంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగులు, ఒకే సంతానం కలిగిన కుటుంబాల్లోని వారికి ప్రాధాన్యం ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, కేంద్ర మావన వనరుల మంత్రిత్వ శాఖ, కేవీఎస్ ఉన్నతాధికారులు సిఫార్సు చేసిన విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
*♦ఆర్‌టీఈలో సీటు దక్కితే ఉచితమే..*
15 శాతం సీట్లను ఎస్సీలకు.. 7.5 శాతం సీట్లను ఎస్టీలకు, 3 శాతం సీట్లను దివ్యాంగులకు రిజర్వు చేస్తారు. మిగిలిన సీట్లు ఇతరులకు కేటాయిస్తారు. జాతీయ విద్యా హక్కు చట్టం(ఆర్‌టీఈ) నిబంధనల మేరకు ప్రతి తరగతిలో 10 సీట్లను ఉచిత బోధనా పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆన్‌లైన్‌లోనే లాటరీ ద్వారా వీరి ఎంపిక ఉంటుంది.
*♦ఆన్‌లైన్‌లో ప్రక్రియ*
కరోనా నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని ఈ ఏడాది కల్పించారు. kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌తో పాటు కేవీఎస్ రూపొందించిన ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్ఛు 20 నుంచి దరఖాస్తుకు ముందుగానే ధ్రువపత్రాల్ని విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధం చేసుకోవాల్సిన అవసరముంది.
Website link :-Click here
To download kvs App :-Click here
To download class wise vacancies :- CLICK HERE
Help desk no :- Click here