:-PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము:-
👉అప్లై చేసేముందు కింద ఇచ్చిన సూచనలు చదవండి.
- మొదటగా నేను కింద ఒక లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్ తీసుకోండి.
- తరువాత అప్లికేషన్ ఫారం లో ఉన్న అన్ని వివరాలు ఎటువంటి తప్పులు లేకుండా నింపండి. దానిలో మీ భూమి వివరాలు అన్ని రాయవల్సి ఉంటుంది.
- అప్లికేషన్ ఫారం నింపిన తరువాత దాన్ని మీ PM కిసాన్ amount ఏ అకౌంట్ లో పడుతున్నాయో ఆ యొక్క బ్యాంకు కు వెళ్లి అప్లికేషన్ ఫారం ను ఇవ్వండి.
- అప్లికేషన్ ఫారం ఇచ్చిన తరువాత బ్యాంకు వాళ్ళు దాన్ని పూర్తి చెక్ చేసిన తరువాత 3 లేదా 4 రోజులలలో మీకు PM కిసాన్ కార్డు ను మంజూరు చేస్తారు .ఈ విధంగా ఆఫ్ లైన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు .మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ సేవ లో కూడా వాళ్ళు అప్లై చేస్తారు.
- దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే రైతులు 3 లక్షల బుణం పొందవచ్చు. ఇది రైతులకు ఒక సువర్ణ అవకాశం.