🔥Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20🔥
ఈ రోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీ కోసం అందివ్వడం జరిగింది...
💥త్వరలో 20 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ💥
👉రాష్ట్రంలో దాదాపు 20వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. నగరంలోని తెలంగాణ పోలీస్ అకాడమీ (టీఎస్‌పీఏ)లో శుక్రవారం 12వ బ్యాచ్‌కు చెందిన 1,162 మంది సబ్– ఇన్‌స్పెక్టర్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 18,428 మంది ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల నియా మకం జరిపామని, ఇంకా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను కూడా నియ మించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తూ సాంకేతికతను విరివిగా ఉపయోగిం చడం ద్వారా స్మార్ట్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. పోలీస్ అకాడమీ ఇంచార్జ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అకాడమీ ద్వారా ఇప్పటివరకు 1,25,848 మంది వివిధ ర్యాంకులకు చెందిన వారికి శిక్షణనిచ్చామని తెలిపారు.
♦️డీఈఈసెట్ కౌన్సెలింగ్‌కు 5,857 మందికి అర్హత*
*👉ఈనాడు, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఈఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో కలిపి మొత్తం 5,857 మంది అర్హత సాధించారు. రాసిన మాధ్యమంలోని కోర్సుల్లో మాత్రమే ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. వారు కౌన్సెలింగ్‌కు హాజరై కన్వీనర్ కోటా కింద సీట్లు పొందొచ్చు. తెలుగు మాధ్యమంలో 3335 మందికి 2341 (70.19 శాతం) మంది అర్హత సాధించారు. తెలుగు విభాగంలో ఎస్.నవీన 63 మార్కులు సాధించి మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఆంగ్ల మాధ్యమంలో 3,979కి 3,158 మంది (79.36శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గండ్ల సాకేత్‌కుమార్ 74 మార్కులు పొంది మొదటి స్థానాన్ని సాధించాడు. ఉర్దూ మాధ్యమంలో 1,199 మందికి 358 మంది (29.85 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ విభాగంలో 73 మార్కులతో హబీబా మొదటి స్థానాన్ని సాధించింది. ఈనెల 24 నుంచి ర్యాంకు కార్డులు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని, కౌన్సెలింగ్ తేదీలు త్వరలో వెల్లడిస్తామని కన్వీనర్ కృష్ణారావు తెలిపారు.
*♦️‘నవోదయ’ ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం*
*👉కూసుమంచి, న్యూస్‌టుడే: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2021-22కి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశానికి గానూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రధానాచార్యులు శోభనవల్లి తెలిపారు. ప్రక్రియ ప్రారంభమైందని డిసెంబరు 15 వరకు కొనసాగుతుందని తెలిపారు.
నేడు తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు
తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడికానున్నాయి. గత నెల 28, 29 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్ పరీక్షలకు రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 63,857 మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఎన్‌టీయూహెచ్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తదితరులు ర్యాంకుల్ని విడుదల చేస్తారు. ఫలితాలు www.eenadu.net లో అందుబాటులో ఉంటాయి.*
*♦️28న ఎడ్‌సెట్ ఫలితాలు
*👉ఈ నెల 28వ తేదీన ఎడ్‌సెట్, నవంబరు 2న ఐసెట్, 6న లాసెట్ ఫలితాలు విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
♦️నేడు తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు
👉హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడికానున్నాయి. గత నెల 28, 29 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్ పరీక్షలకు రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 63,857 మంది విద్యార్థులు హాజరయ్యారు. జేఎన్‌టీయూహెచ్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తదితరులు ర్యాంకుల్ని విడుదల చేస్తారు. ఫలితాలు www.eenadu.net లో అందుబాటులో ఉంటాయి.*
*♦️28న ఎడ్‌సెట్ ఫలితాలు
*👉ఈ నెల 28వ తేదీన ఎడ్‌సెట్, నవంబరు 2న ఐసెట్, 6న లాసెట్ ఫలితాలు విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
💥ఓయూ బీఏ ఎల్ఎల్‌బీ సెమిస్టర్ ఫలితాలు విడుదల💥
👉: బీఏ ఎల్ఎల్‌బీ సెమిస్టర్ ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్, అక్టోబర్‌లో నిర్వహించిన బీఏ ఎల్ఎల్‌బీ(5 ఏళ్లు) పదో సెమిస్టర్ రెగ్యులర్ అదేవిధంగా బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను www.osmania.ac.in. కు లాగినై తెలుసుకోవచ్చు.