*తెలంగాణ ఉద్యోగ, ఉపాద్యాయ, పెంఛనర్లకు శుభవార్త...!
జూన్ నెల నుండి పూర్తి జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి ఆర్థిక మంత్రి అంగీకారం.*
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక పక్షాన
ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ హరీష్ రావు గారిని ఈ రోజు వారి నివాసంలో కలవడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయుల అందరికీ జూన్ నెల మాసం నుండి పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి మంత్రిగారు అంగీకరించారు. అదేవిధంగా బకాయి లకు సంబంధించి జి పి ఎఫ్ లో జమ చేయాలనుకుంటున్నామని చెప్పారు. అయితే
సిపిఎస్ మరియు పెన్షనర్లకు ఎలాఇస్తారని ప్రస్తావించినప్పుడు మంత్రిగారు వారి బకాయిలు ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వడానికి ఆలోచిస్తున్నామన్నారు.
ఈ సందర్భంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన బకాయిలు కూడా జిపిఎఫ్ లో కాకుండా నగదు రూపంలోనే ఇవ్వాలని మంత్రిగారిని ఐక్యవేదిక పక్షాన కోరడం జరిగింది.
*