*💥ఆదాయపన్ను రిటర్న్‌ల గడువు పొడిగింపు💥*
దిల్లీ: ఆదాయపన్ను చెల్లింపు దారులకు వెసులుబాటు కలిగిస్తూ ఆర్థిక శాఖ ఓ నిర్ణయానికి వచ్చింది.
👉2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి గడువును పొడిగించింది.
👉ఈ నిర్ణయంతో ఉద్యోగులు తమ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్‌లను డిసెంబర్ 31 లోగా చెల్లించే వీలు కలుగుతుంది.
👉ఇక ఆడిటింగ్ అనంతరం పన్ను చెల్లించేవారు మరో నెల అనంతరం అంటే జనవరి 31, 2021 లోగా సమర్పించవచ్చని ఆ శాఖ తెలిపింది.
👉ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘‘ప్రభుత్వ నిబంధనల ప్రకారం జులై 31, 2020న ఆదాయ పన్ను రిటర్న్‌లను నమోదు చేయాల్సిన చెల్లింపుదారులకు గడువు తేదీని డిసెంబర్ 31, 2020 దాకా పొడిగించారు.
👉అదే విధంగా ఆడిటింగ్ చేసిన ఖాతాల ఆధారంగా ఆదాయ పన్ను చెల్లించే వారికి చివరి తేదీని జనవరి 31, 2021గా నిర్ణయించారు.’’అని తెలిపింది.
👉కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పన్ను చెల్లింపు దారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆర్థికశాఖ వివరించింది.
0 Comments