రేపటి నుంచే ధరణి

💥రేపటి నుంచే ధరణి💥

         

♦️ఎంసీపల్లిలో పోర్టల్‌ ప్రారంభించనున్న సీఎం*

♦️తహసీల్దార్‌ వద్దే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌*

♦️వెంటనే రికార్డుల్లో కొనుగోలుదారుకు మ్యుటేషన్‌*

♦️తొలి దశ లో నాలుగు రకాల రిజిస్ట్రేషన్లు*

♦️సీఎం సరేనంటే వ్యవసాయేతర భూములకూ*

👉దాదాపు యాబై రోజులుగా నిలిచిపోయిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ గురువారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అదే రోజు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే రెండింటినీ గురువారమే ప్రారంభిస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయాల్సిన తహసీల్దార్లకు ఇప్పటికే ధరణిపై శిక్షణ ఇచ్చారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టే సబ్‌ రిజిస్ట్రార్లకు ఎలాంటి శిక్షణ అవసరం లేదు. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలన్న దానిపై సీఎం కేసీఆర్‌ మంగళవారం వరకు స్పష్టత ఇవ్వలేదు. ఇబ్బందులు ఎదురైతే తొలుత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టి, వచ్చే నెల మొదటి వారంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేపడతారని అంటున్నారు.```



👉రాష్ట్రవ్యాప్తంగా 474 తహసీల్దార్‌ కార్యాలయాల్లో తహసీల్దార్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదాలో వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వెనువెంటనే రికార్డుల్లో మ్యుటేషన్‌ చేపడతారు. దీనికోసం ధరణి(సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానం)కి శ్రీకారం చుడుతున్నారు. గురువారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం 12:45  గంటలకు సీఎం కేసీఆర్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ఈ గ్రామం ముఖ్యమంత్రి ఫాంహౌ్‌సకు సమీపంలోనే ఉంది.```



👉ధరణిలో తొలి దశలో నాలుగు రకాల డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయడానికి తహసీల్దార్లకు అనుమతినిచ్చారు. సేల్‌డీడ్‌(భూముల విక్రయాలు), పార్టిషన్‌(భూపంపకాలు), సక్సెషన్‌(వారసులకు భూములపై అధికారం), గిఫ్ట్‌ డీడ్‌(బహుమతి)లను తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా వాణిజ్య అవసరాల కోసం మార్చే అధికారం కూడా తహసీల్దార్లకే కట్టబెట్టడంతో పై నాలుగు రకాల డాక్యుమెంట్ల నమోదుతో పాటు నాలా(వ్యవసాయేతర భూమార్పిడి) అధికారంతో వారు బాధ్యతలు చేపట్టనున్నారు.```



👉ధరణి ఆధారంగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ చేయనుండటంతో దీనికోసం ‘తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌ పుస్తకం చట్టం-2020’ను అనుసరించి, రూల్స్‌ను విడుదల చేయనున్నారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ అధికారాలు కల్పిస్తూ జీవో కూడా జారీ కానుంది. ధరణి రికార్డులనే ప్రామాణికంగా చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేయడంతో 1.55 కోట్ల ఎకరాల పట్టా భూముల క్రయవిక్రయాలన్నీ తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే జరుగనున్నాయి.```
0 Comments