ఎల్‌టీసీ ఓచర్లు: బీమా ప్రీమియంలకు కూడా*

 *🔊ఎల్‌టీసీ ఓచర్లు: బీమా ప్రీమియంలకు కూడా*




 *👉ప్రభుత్వ ఉద్యోగులకు పండగ బొనాంజా కింద ప్రకటించిన ఎల్‌టీసీ నగదు ఓచర్‌ పథకంపై కేంద్రం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. అక్టోబరు 12, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య కొత్తగా తీసుకున్న బీమా పాలసీల కోసం ఉద్యోగులు చెల్లించిన ప్రీమియంలకు కూడా ఈ పథకం కింద రియంబర్స్‌మెంట్‌ పొందవచ్చని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ కొన్ని ప్రశ్నలకు సమాధానంగా పేర్కొంది. అంతేగాక, ఉద్యోగులు తాము కొనుగోలు చేసిన వస్తువులకు ఒరిజినల్‌ బిల్లులకు బదులు నకలు బిల్లులు(ఫొటోకాపీలు) కూడా పెట్టుకోవచ్చని స్పష్టం చేసింది.*


*👉అక్టోబరు 12న ఈ ఎల్‌టీసీ(లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌) నగదు ఓచర్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకం కింద ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లతో కూడా వస్తువులు కొనుగోలు చేయవచ్చని గతంలో చెప్పిన ఆర్థిక మంత్రిత్వ శాఖ.. తాజాగా బీమా ప్రీమియంలకు కూడా పథకం వర్తిస్తుందని వెల్లడించింది. అయితే ఉద్యోగులు అక్టోబరు 12, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య కొత్తగా తీసుకున్న బీమా పాలసీల ప్రీమియంలకు మాత్రమే ఈ పథకం ద్వారా రియంబర్స్‌మెంట్‌ పొందొచ్చని పేర్కొంది. ఇప్పటికే ఉన్న పాత బీమా పాలసీలకు ఎల్‌టీసీ స్కీమ్‌ వర్తించదని స్పష్టం చేసింది. ఈ ప్రయోజనాలు పొందాలనుకునే ఉద్యోగులు వచ్చే ఏడాది మార్చి 31లోగా తమ బిల్లులన్నింటినీ సమర్పించాలని పేర్కొంది. అయితే, ఒరిజినల్‌ బిల్లులే కాకుండా నకలు కాపీలను కూడా అందించొచ్చని తెలిపింది. అయితే, ఏదైనా సమాచారం అవసరమైతే ఒరిజినల్‌ బిల్లులు కూడా ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది.*



*👉విహారయాత్రలు లేదా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రతి నాలుగేళ్లకొకసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఎల్‌టీసీలు ఇస్తుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రయాణాలు కష్టతరమైన నేపథ్యంలో చాలా మందిఈసదుపాయాన్ని వినియోగించుకోలేకపోయారు. అందుకే ప్రభుత్వం ఈ ఎల్‌టీసీలను నగదు ఓచర్ల రూపంలోకి మార్చింది. వీటిని 2021 మార్చి 31 వరకు ఉపయోగించుకునేలా పథకం తీసుకొచ్చింది. అయితే ఈ ఓచర్లకు కొన్ని పరిమితులు విధించింది. ఉద్యోగులు కేవలం ఆహారేతర వస్తువుల మాత్రమే కొనుక్కోవాలి. అవి కూడా 12శాతం అంతకంటే ఎక్కువ జీఎస్‌టీ అమలయ్యే వస్తువులే ఉండాలి. వీటిని జీఎస్‌టీ నమోదిత అవుట్‌లెట్లలో డిజిటల్ రూపంలో మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది.*

0 Comments