ఈ-ఫైలింగ్ మొబైల్ లో చేసుకునే విధానం


ఈ-ఫైలింగ్ ( e-filing) మొబైల్ లో చేసుకునే విధానం .

              


                   Income tax ఈ ఫైలింగ్ ఇప్పుడు మన మొబైల్ లో కూడా సులభంగా చేయొచ్చు.
సెక్షన్ 139 ప్రకారం ప్రతి సంవత్సరం జూలై31 లోపు,  2,50,000 ఆదాయం దాటిన వారందరూ తప్పనిసరిగా ఈ-ఫైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

☑️ముందుగా మీ DDO లు ఆన్లైన్ లో TDS దాఖలు చేయాల్సి ఉంది.. TDS అయింది లేనిది incometax వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత FORM26AS డౌన్లోడ్ చేసుకొని చూస్తే మన పాన్ నెంబర్ ద్వారా ఎంత టాక్స్ చెల్లించింది తెలుస్తుంది.

👉1)ముందుగా form16 ను సిద్ధంగా ఉంచుకోవాలి.https://incometaxindiaefiling.gov.in/home
వెబ్సైట్ క్లిక్ చేయండి..
నోట్: financial year 2016-17 కు assessment year 2017-18 అవుతుంది.

👉2) register yourself క్లిక్ చేసి యూజర్ ఐడి గా పాన్ కార్డ్ నెంబర్ , పేరు, చిరునామా,  మొదలైన వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.. ఈమెయిల్ otp, మొబైల్ otp ఎంటర్ చేయాల్సి వుంటుంది.

👉3) తర్వాత లాగిన్ కావాలి. Dashboard లో  filling of income tax return ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు assesment year, ఫారం ITR-1, సబ్మిషన్ మోడ్ prepare and submit సెలెక్ట్ చేయాలి. తర్వాత aadhar OTP ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని continue క్లిక్ చేయాలి
*నోట్:* ఆధార్ లో మొబైల్ నెంబర్ ఎంటర్ అయి లేకపోతే వారు, i don't want e-verify  ఆప్షన్ ఎంటర్ చేసుకొని, పూర్తిచేసిన ఫారం ను బెంగళూర్ అడ్రస్ కు పోస్ట్ లో పంపాల్సి ఉంటుంది..
ఆధార్ otp ద్వారా అయితే ఎవరికీ ఫారం పంపాల్సిన అవసరం లేదు

👉4)instructions పేజీలో చదివి next క్లిక్ చేయాలి,

👉5)Part A -General Information పేజీ లో వ్యక్తిగత వివరాలలో ఏమైనా తేడా ఉంటే సరి చేసుకొని తర్వాత save draft క్లిక్ చేయాలి..తర్వాత next చేయాలి.

👉6)income details పేజీ లో ఆదాయం వివరాలు, save draft క్లిక్ చేసి next క్లిక్ చేయాలి.

👉7) tax details పేజీలో డిదక్షన్ వివరాలు సెక్షన్ వారీగా నమోదు చేయాలి

👉8)తర్వాత taxes paid and verification పేజీలో TDS వివరాలు , బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి.

👉9)80G పేజీలో ఏదైనా విరాళాలు ఉంటే ఎంటర్ చేయాలి లేకపోతే వదిలేయాలి.

👉10) preview and submit ఆప్షన్ క్లిక్ చేయాలి. మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి.

ఇప్పుడు మీ e-ఫైలింగ్ పూర్తి అయినట్టు మెసేజ్ వస్తుంది. dashboard లో view returns ఆప్షన్ ద్వారా మన ITR FORM మరియు ACKNOWLEDGEMENT ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

👉👉Website link :- Click here
0 Comments