సంక్రాంతి తర్వాత స్కూళ్లు ఒపెన్​.. టెన్త్ పరీక్షల్లో భారీ మార్పులు..


సంక్రాంతి తర్వాత స్కూళ్లు ఒపెన్​.. 

 టెన్త్ పరీక్షల్లో భారీ మార్పులు.

11 పేపర్లను 6కు కుదింపు*

             


👉కరోనా ఎఫెక్ట్​తో డిస్ట్రబ్​ అయిన విద్యా సంవత్సరానికి సంబంధించి దిద్దుబాటు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

♦️ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటి ప్రకారం జనవరి 14.. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలన్నీ ఓపెన్​ అవుతాయి.       జనవరి మొదటి వారంలోనే ప్రారంభించాలని విద్యాశాఖ ముందుగా ప్రతిపాదించినప్పటికీ.. కరోనా వైరస్​ నేపథ్యంలో చలి తీవ్రత తగ్గిన తర్వాత ఓపెన్​ చేయాలని సీఎం కేసీఆర్​ సూచించినట్లు తెలిసింది. 

♦️దీనికి అనుగుణంగా సంక్రాంతి తర్వాత విద్యా సంస్థలు ప్రారంభించేందుకు ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు చేశారు.*

      Job and education updates 21/12/20 :- Click here

♦️ఈ అకడమిక్​ ఇయర్ లో మొదటి ఆరు నెలలు పూర్తి కావటంతో.. ఇప్పటికిప్పుడు తరగతులు ప్రారంభించినా సిలబస్ పూర్తి చేసే అవకాశం లేదని… ఆన్​ లైన్​ క్లాసులతో పెద్ద ప్రయోజనం జరగలేదని విద్యాశాఖ, ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 

♦️అందుకే విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా పరీక్షల విధానాన్ని మార్చాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం టెన్త్ లో ఇప్పుడున్న 11 పేపర్లను ఆరు పేపర్లకు తగ్గించే అవకాశాలున్నాయి.

 ♦️అందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.*


👉గతంలో సిలబస్​ తగ్గింపుపై తీవ్ర వ్యతిరేకత రావటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సిలబస్​కు బదులుగా పేపర్లను కుదించటం బెటర్​ అని అధికారులు 6 పేపర్లకు మొగ్గు చూపుతున్నారు. 

👉తొమ్మిది, పదో తరగతి రెండింటికీ పేపర్లను కుదించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలోనే అధికారికంగా ఈ వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.


♦️వీఆర్వోలకు కొత్త బాధ్యతలు..♦️


💥పురపాలక శాఖలో 40 శాతం వీఆర్వోల విలీనం!💥


పురపాలికల్లో 2,200 మందినియామకం


♦️ రెవెన్యూ అధికారు (వీఆర్వో)లను రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. 

♦️కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 5,348 మంది వీఆర్వోలు గత కొన్ని నెలలుగా పనిలేకుండా ఖాళీగా ఉంటున్నారు. అవసరాన్ని బట్టి వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని, అప్పటివరకు వారికి యథావిధిగా జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

♦️ఇప్పుడు వీరిలో 40 శాతం మందిని పురపాలక శాఖలోకి తీసుకోనున్నారు.వార్డుకొకరు చొప్పున: జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో దాదాపు 2,200 వార్డు ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

♦️తొలుత ప్రత్యక్ష నియామకాల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. 

♦️ఈ మేరకు కొత్త పోస్టులు సృష్టించడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి కోరుతూ పురపాలక శాఖ ఇటీవల ప్రతిపాదనలు సైతం పంపించింది. అయితే వీఆర్వోలను పురపాలక శాఖలో విలీనం చేసుకుని వార్డు ఆఫీసర్లుగా నియమించాలనే ఆలోచన రావడంతో ప్రత్యక్ష నియామకాల ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనబెట్టింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేసేందుకు అవసరమైన విధివిధానాలను ప్రభుత్వం రూపొందించాల్సి ఉంది. 

♦️ప్రభుత్వ అవసరాలు, ఖాళీలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలో విలీనం కావడానికి వీఆర్వోల నుంచి ఆప్షన్లను స్వీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇతర శాఖల్లో వీఆర్వోలను విలీనం చేస్తే 5,348 మందిలో 40 శాతం మంది ఒక్క పురపాలక శాఖకే వస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

0 Comments