🔥LRS పై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం 🔥


 LRS లేకుండా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్

           


ప్రభుత్వ నిర్ణయంతో వ్యవసాయేతర భూములకు సంబంధించిన వారికి ఊరట

కొత్తగా చేసిన ఫ్లాట్ లకు ఎల్ ఆర్ ఎస్ లేకుండా  అనుమతి లేదు

 ఎల్‌ఆర్‌ఎస్‌ పై ప్రభుత్వం కీలక నిర్ణయం 

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది. రిజిస్ట్రేషన్‌ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్‌ కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి నిరాకరించింది. అనుమతులు ఉన్న, క్రమబద్ధీకరణ అయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

0 Comments