TS TET - 2021 Top 50 General science bits


TS TET - 2021 Top 50 General science bits

Topic :- పోషణ - విటమిన్స్

 1) ఒక గ్రామ్ కార్బోహైడ్రేట్స్ లో ఎంత కాలరీల శక్తి వస్తుంది?

జ: 4.2 కిలోల కాలరీలు

2) మనిషికి ఒక రోజుకి ఎన్ని గ్రాముల కార్బోహైడ్రేట్స్ అవసరం ?

జ: 500 గ్రాములు

3) కార్బోహైడ్రేట్లలో ఉండే మూలకాలు ఏంటి ? అవి ఏ నిష్పత్తిలో ఉంటాయి?

జ.కార్బన్ (C), హైడ్రోజన్ (H), ఆక్సిజన్ (O). ఇవి 1: 2 : 1 నిష్పత్తిలో ఉంటాయి.

4) మొక్కల్లో పిండి పదార్దం తయారైందని నిరూపించే పరీక్ష ఏది?

జ: అయోడిన్ పరీక్ష

5) చక్కెరలు ఎన్ని రకాలు? అవి ఏంటి ?

జ: (1) మోనోశాకరైడ్ (2) డై శాకరైడ్  (3) పాలి శాకరైడ్

6) మోనో శాకరైడ్స్ అంటే ఏంటి ? అవి ఏవి ?

జ: సులభంగా నీటి కరిగే శక్తి కలవి. ఉదా: గ్లూకోజ్,ఫ్రక్టోజ్, గాలక్టోజ్

7) గ్లూకోజ్ ను ఏమంటారు?శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ ఎలా ఉండాలి ?

జ: గ్రేప్ షుగర్. గ్లూకోజ్ రక్తంలో 80-120mg/100ml. (గ్లూకోజ్ ని కొలిచే పరికరం గ్లూకో మీటర్)

8) గ్లూకోజ్ ఎవరికి తక్షణం శక్తినిచ్చే చక్కెర?

జ: క్రీడాకారులకు

9) రక్తంలో ఉండే గ్లూకోజు స్థాయిని ఏ హోర్మోను స్దిరంగా ఉంచుతుంది?

జ: ఇన్సులిన్

10) దేని లోపంతో రక్తంలో గ్లూకోజ్ ఎక్కువై డయాబెటీస్ వ్యాధి వస్తుంది ?

జ: ఇన్సులిన్ లోపం (డయాబెటిస్ మెల్లిటన్)

8) ప్రపంచంలోనే అతి తియ్యని చక్కర ఏది ?

జ: ఫ్రక్టోజ్ (Fruit/Honey sugar) (ఫ్రూట్ షుగర్, పండ్ల చక్కెర)

9) అతి ఎక్కువ తియ్యదనం ఉన్న చక్కెర ఏది? ఇది ఎందులో ఉంటుంది?

జ: ఫ్రక్టోజ్. ఇది తేనె, పండ్లు, తేలు విషంలో ఉంటుంది

10) నీటిలో కరగడానికి కొద్దిగా సమయం తీసుకునే శాకరైడ్స్ ఏవి ?

జ:  డైశాకరైడ్స్. రెండు చక్కెర అణువులు ఏర్పడడాన్ని డై శాకరైడ్ అంటారు. ఉదా:  సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్.

11) సుక్రోజ్ కు ఇంకో పేరు ఏంటి ? ఇది ఏయే పదార్దాల్లో ఉంటుంది?

జ: కేన్ షుగర్, టేబుల్ షుగర్. చెరుకురసం, బీట్ రూట్, కొబ్బరినీళ్లల్లో సుక్రోజ్ ఉంటుంది.

12) లాక్టోజ్ కు గల ఇంకో పేరు ఏంటి ? ఇది పాలల్లో ఎంత శాతం ఉంటుంది ?

జ: మిల్క్ షుగర్ అంటారు. పాలల్లో  7-8శాతం ఉంటుంది.

13) లాక్టోజ్ ను ఏ రకమైన చక్కెర అంటారు ?

జ: అతి తక్కువ తియ్యదనాన్ని కలిగిన చక్కర

14) మాల్టోజ్ కు గల ఇంకో పేరేంటి ? ఇది ఎందులో లభిస్తుంది?

జ: మాల్ట్ షుగర్. మొలకెత్తిన బార్లీ గింజల నుంచి

15) సెల్యులోజ్ కు గల మరో పేరు ఏంటి ? ఇది ఏ జంతువుల్లో జీర్ణం అవుతుంది ?

జ: ప్లాంట్ స్ట్రార్చ్ . శాకాహార జంతువులైన గుర్రం, కుందేలు, గేదె, ఆవుల్లో  జీర్ణమవుతుంది.

16) గ్లైకోజన్ కు గల మరో పేరేంటి ? ఇది ఎందులో నిలువ చేయబడుతుంది ?

జ.యానిమల్ స్టార్చ్ అంటారు. జంతువుల కాలేయంలో ఉంటుంది.

17) శాకరిన్ లో ఎన్ని రెట్లు చక్కెర ఉంటుంది ?

జ: 550 రెట్లు

18) ఒక గ్రాము ప్రోటీన్ నుంచి ఎంత శక్తి లభిస్తుంది?

జ: 5.3 నుంచి 5.6 కేలరీల శక్తి

19) ప్రోటీన్లలో ఉండే మూలకాలు ఏంటి?

జ: C H O N S (కార్బన్, హైడ్రోజన్, ఆక్సీజన్, నైట్రోజన్, సల్ఫర్)

20) మనిషికి రోజుకి ఎన్ని కేలరీల ప్రొటీన్స్ అవసరం ?

జ: 70-100 గ్రాములు

21) ప్రోటీన్ లో ఉండే ముఖ్యమైన మూలకం ఏది?

జ: నైట్రోజన్ (భూమ్మీద జీవులు ఏర్పడటానికి ఇదే కారణం)

22) ప్రోటీన్ల శాతం వేటిల్లో ఎక్కువుగా ఉంటుంది ?

జ: సోయాబీన్స్ లో. దీన్ని పేదవారి మాంసం అంటారు.

23) ప్రపంచంలో అత్యధిక ప్రొటీన్స్ ఉన్న జంతు పదార్థం ఏది ?

జ: మాంసం

24) ప్రొటీన్ల లోపం వల్లే పిల్లల్లో కనబడే వ్యాధి ఏది ?

జ: క్యాషియార్కర్ (ఎర్ర జుట్టు)

25) మానవుడి శరీరంలో ఉండే మొత్తం అమైనో ఆమ్లాల సంఖ్య ఎంత?

జ: 24

26) చిన్నపిల్లల్లో ఉండే అమైనో ఆమ్లం ఏది?

జ: హిస్టిడిన్

27) ప్రోటీన్లు - అవి లభించు ప్రదేశాలు

జ: కేసిన్   -    పాలు

కెరాటిన్ -   గోర్లు, గిట్టలు, కొమ్ములు, వెంట్రుకలు, ఉన్ని

బి.కెరోటిన్ - ఆకుకూరలు

28) 1గ్రాము క్రొవ్వు నుంచి ఎంత శక్తి వస్తుంది?

జ: 9.43 నుంచి 9.45 కిలోల కాలరీలు శక్తి

29) క్రొవ్వుల్లో ఉండే మూలకాలు ఏంటి?

జ: C H O

30) వనస్పతి లేదా డాల్డా దేని నుంచి లభిస్తుంది?

జ: Ni మూలకం సమక్షంలో హైడ్రోజనీకరణం చేస్తే

31) మానవుడికి అవసరమైన ఖనిజ పోషకాల సంఖ్య ఎంత?

జ: 54

32) శరీరంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది?

జ: O ( ఆక్సిజన్)

33)శరీరంలో ఎక్కువగా ఉండే లోహం ఏది? తక్కువగా ఉండే మూలకం,లోహం ఏది?

జ: Ca ( కాల్షియం ), Mn (మాంగనీస్)

34) రక్తంలో ఉండే మూలకం ఏది? వాతావరణంలో ఎక్కువగా ఉండే మూలకం ఏది?

జ: ఐరన్ (Fe), N ( నైట్రోజన్ )

35) కాల్షియం లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?

జ: ఆస్టియో మలేషియా

36) ఫాస్పరస్ (P)లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది?

జ: రికెట్స్ వ్యాధి. ఇది చిన్నపిల్లలకు వస్తుంది.

37) క్లోరిన్ (Cl)లోపంతో ఏ వ్యాధి వస్తుంది?

జ: డీ హైడ్రేషన్

38) అయోడిన్ (I)లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది?

జ: గాయిటర్

39) ఫ్లోరిన్ (F) లోపంతో ఏ వ్యాధి వస్తుంది?

జ: ఆస్టోయో ఫ్లోరోసిస్

40) ఫెర్రస్ (Fe) ఇనుము లోపంతో ఏ వ్యాధి వస్తుంది?

జ: ఎనీమియా (రక్తహీనత)

41) పిల్లల్లో పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులేవి?

జ: క్వాషియోర్కర్

42) క్వాషియార్కర్ అనే పదానికి అర్థమేంటి ?

జ: నిర్లక్ష్యం చేయబడిన శిశువు. ఇది ఆఫ్రికా పదం

43) ఏ లోపం వల్ల క్వాషియార్కర్ వ్యాధి వస్తుంది?

జ: ఆహారంలో ప్రోటీన్ల లోపంతో

44) విటమిన్లను మొదటిసారిగా కనిపెట్టిందెవరు ? విటమిన్లు ఎందులో ఉన్నాయని నిరూపించాడు?

జ: HG హాప్ కిన్స్. 1912 లో కనిపెట్టాడు. పాలల్లో గుర్తించారు.

45) విటమిన్లకు ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? పాలిష్ బియ్యాన్ని తినడం వల్ల ఏ వ్యాధి వస్తుందని నిరూపించారు?

జ: ఫంక్, బెరి బెరి వ్యాధి వస్తుందని 1912లో నిరూపించాడు.

46) మొదటిసారి కనుగొన్న విటమిన్ ఏది? ఇది ఏ పండ్లలో ఉంటుంది?

జ: C విటమిన్. నిమ్మ, ఉసిరి

47) B12 విటమిన్ దేని నివారణలో ఉపయోగిస్తారు?

జ: బ్లడ్ క్యాన్సర్ నివారణకు

48) Q విటమిన్ దేనికి ఉపయోగిస్తారు?

జ: రక్తం గడ్డకట్టడానికి

49) విటమిన్లు ఎన్ని రకాలు? అవి ఏంటి?

జ: 2 రకాలు.

(1) నీటిలో కరిగే విటమిన్లు : B కాంప్లెక్స్, C విటమిన్

(2) కొవ్వులో కరిగే విటమిన్లు : A D E K

50) క్యాన్సర్ నిరోధించే విటమిన్లు ఏవి?

జ: A C E

51) రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగ పడే విటమిన్లు ఏవి?

జ: K, Q

52) మానవుని పేగులో ఉండే  ఈకొలై బాక్టీరియా సంశ్లేషణలో పాల్గొనే విటమిన్లు ఏవి?

జ: K, B12

0 Comments