TS Ed.cet 2021 లో భారీ మార్పులు :-

TS Ed.cet 2021 లో భారీ మార్పులు :-

ఈసారి B.Ed., కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే Ed.CET ప్రశ్నపత్రం మారుతోంది. 

2021-22 సంవత్సరానికి జరిగే ప్రవేశ పరీక్షకు ఇకపై డిగ్రీలో ఏ కోర్సు చదివినా ఒకటే ప్రశ్నాపత్రాన్ని ఇవ్వబోతున్నారు. 

ఎడ్ సెట్ కమిటీ సమావేశంలో ఈ కొత్త విధానంపై నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎడ్ సెట్ రాయాలంటే ఏ మెథడాలజీనో ఎంచుకొని అందులో మాత్రమే రాయాల్సి ఉండేది.

 కానీ కొత్త పద్దతిలో అందరికీ ఒకటే పరీక్ష నిర్వహిస్తున్నారు. దాంతో B.Sc., మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన విద్యార్థి B.Ed., లో Maths or Physics మెథడాలజీని ఎంచుకోవచ్చు.

 B.Z.c., వారు బయాలజీతో పాటు ఫిజిక్స్ తీసుకోవచ్చు. B.A. ఇంగ్లీష్ వాళ్ళు పరీక్ష కోసం మ్యాధ్స్, సైన్స్, సోషల్ చదవాల్సి ఉంది.

 అయితే 10వ తరగతిలోపు సిలబస్ లో ప్రశ్నలేఇస్తారు.

కొత్త పరీక్ష ఇలా ఉంటుంది

Subjects                                               Marks

Maths + Science + Social                  60

Teaching Aptitude                              20

General English                                  20

GK, Educational Issues                    30

Computer Awareness                       20

Total Marks                                     150

ఎడ్ సెట్ షెడ్యూల్ వివరాలు

నోటిఫికేషన్ జారీ : March 20

దరఖాస్తుల స్వీకరణ: March 24

ఫైన్ లేకుండా దరఖాస్తుకు చివరి తేది: May 5

అప్లికేషన్ ఫీజు : రూ.850, SC/ST/PHCలకు రూ.450

ప్రవేశ పరీక్ష : ఆగస్టు 2021 (డేట్ తర్వాత అనౌన్స్ చేస్తారు )

 

Ed CET మార్పులు ఇవే

  • ఎడ్ సెట్ పేపరులో ఇప్పటి దాకా జనరల్ ఇంగ్లీష్ కు 25 ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు 20కి తగ్గాయి
  • జనరల్ నాలెడ్జ్ కు 15 ప్రశ్నలు. వర్త విద్యాసంబంధ అంశాలను చేర్చి 30 ప్రశ్నలకు పెంచారు
  • టీచింగ్ ఆప్టిట్యూడ్ గతంలో 10 ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు 20కి పెంచారు
  • ఒక్కో మెథడ్ కు 100 ప్రశ్నలు ఉండగా, 20 ప్రవ్నల చొప్పున 3 మెథడ్స్ కలిపి 60 ప్రశ్నలు ఇస్తారు.
0 Comments