*Breaking News...*
*టెన్త్ పరీక్షలు రద్దు..!*
*ఇంటర్ ఎగ్జామ్స్ వాయిదా..!*
*కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే (సీబీఎస్ఈ) పదోతరగతి పరీక్షలను రద్దు చేయగా, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.*
*ఈ నేపథ్యంలోనే అకాడమిక్ ఇయర్ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను, పేరెంట్స్ ఆందోళనలను దృష్టి పెట్టుకుని పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులను ఈనెల 30 వరకు పొడగించడంతో పాటు పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
0 Comments