Telangana Model Schools Admission notification 2021-22

 Telangana Model Schools Admission notification 2021-22  


తెలంగాణలోని మోడల్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం


మోడల్​ స్కూళ్లలో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది.


 ఆరో తరగతి ప్రవేశాలకు ఏప్రిల్​ 15 నుంచి అప్లికేషన్​ ప్రాసెస్​ ప్రారంభం కానుంది. 


 ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ జూన్‌లో నిర్వహిస్తారు.



రాష్ర్టవ్యాప్తంగా ఉన్న మొత్తం 194 మోడల్ స్కూళ్లలో ఒక్కో స్కూల్‍లో వంద సీట్ల చొప్పున ఆరోతరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. 


మిగిలిన తరగతుల్లో ఉన్న ఖాళీల ఆధారంగా ప్రవేశాలుంటాయి. ఇందులో చేరిన స్టూడెంట్స్​కు ఎలాంటి ఫీజు ఉండదు. 

ఉచితి వసతితో పాటు పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం అందిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో బోధనతో పాటు నీట్, ఎంసెట్, జేఈఈ, సీఏ, సీపీటీ, టీపీటీ, సీఎస్ వంటి పోటీ పరీక్షలకూ శిక్షణ ఇస్తారు. 


అర్హతలు:

 ఆరో తరగతిలో చేరేందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్​ నుంచి ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి.

వయసు:

 ఆరో తరగతికి స్టూడెంట్​ వయసు 10 ఏళ్లు నిండి ఉండాలి. ఏడుకు 11, ఎనిమిదికి 12, తొమ్మిదికి 13, పదికి 14 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 

సెలెక్షన్​ ప్రాసెస్​: 

ఎంట్రెన్స్​లో స్టూడెంట్​ చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్​ నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తారు.


ఎగ్జామ్​ ప్యాటర్న్​

ఆరోతరగతి ప్రవేశ పరీక్షలో 100 మార్కులకు వంద ప్రశ్నలిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో ఉంటుంది. 

ఆరోతరగతి పేపర్‌లో తెలుగు, మ్యాథమెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్(సైన్స్ &సోషల్), ఇంగ్లిష్ నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశించే స్టూడెంట్స్​కు ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్​లలో ఒక్కో సబ్జెక్టు నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 

ఆబ్జెక్టివ్‍ విధానంలో ఉండే ఈ ఎగ్జామ్​ డ్యురేషన్​ రెండు గంటలు. 

ఆరోతరగతి ఎంట్రెన్స్​

సబ్జెక్ట్​           ప్రశ్నలు    మార్క్స్​

తెలుగు           25         25

మ్యాథమెటిక్స్   25         25

సైన్స్ & సోషల్‍  25         25

ఇంగ్లిష్‍             25         25

మొత్తం           100       100

7 నుంచి 10వ తరగతి

సబ్జెక్ట్​           ప్రశ్నలు      మార్క్స్​

ఇంగ్లిష్‍            25           25

మ్యాథమెటిక్స్   25           25

జనరల్‍ సైన్స్    25           25

సోషల్‍ స్టడీస్‍    25           25

మొత్తం           100        100


ముఖ్య సమాచారం

6వ తరగతి అప్లికేషన్లు: ఏప్రిల్​ 15 నుంచి 30 వరకు

7 నుంచి 10 తరగతులకు: ఏప్రిల్​ 20 నుంచి 30 వరకు

అప్లికేషన్​ ఫీజు: 

జనరల్​ స్టూడెంట్స్​కు రూ.150, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్​కు రూ.75

హాల్​టికెట్ల డౌన్​లోడ్​:

 జూన్​ 1 నుంచి జూన్​ 6 వరకు

ఆరో తరగతి ఎంట్రెన్స్​:

 జూన్​ 6

7 నుంచి 10 తరగతుల ఎంట్రెన్స్​: 

జూన్​ 5

ఫలితాల ప్రకటన: జూన్​ 14

మెరిట్​ లిస్ట్​ విడుదల: జూన్​ 17

సర్టిఫికెట్ల వెరిఫికేషన్​, ప్రవేశాలు: జూన్18 నుంచి జూన్​ 20 వరకు

తరగతులు ప్రారంభం: జూన్​ 21


Online Apply Here


Notification pdf:-


👇👇👇


CLICK HERE 


0 Comments