TG V CET application date extended to 30-4-2021

TG V CET application date extended to 30-4-2021

 *టీజీసెట్‌ దర‌ఖాస్తు గడువు పెంపు*


 రాష్ట్ర గురు‌కుల విద్యా‌ల‌యాల సంస్థ 2021–22 విద్యా సంవ‌త్సరంలో ఐదో తర‌గతి ప్రవే‌శాల కోసం నిర్వహిస్తున్న టీజీసెట్‌ దర‌ఖాస్తు గడు‌వును పొడి‌గిం‌చింది. 2020–21లో నాలుగో తర‌గతి పూర్తి‌చే‌సిన విద్యా‌ర్థులు గురు‌కు‌లాల్లో ఐదో తర‌గతి ప్రవేశ పరీ‌క్షకు హాజ‌ర‌య్యేం‌దుకు దర‌ఖాస్తు గడు‌వును ఈ నెల 3 నుంచి 15వ తేదీ‌వ‌రకు పొడి‌గి‌స్తు‌న్నట్టు సెట్‌ కన్వీ‌నర్‌ డాక్టర్‌ ఆర్‌‌ఎస్‌ ప్రవీ‌ణ్‌‌కు‌మార్‌ ప్రకటించారు. పూర్తి వివ‌రా‌లకు టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 425 45678కి కాల్‌‌చే‌యా‌లని సూచిం‌చారు.*


*👉ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..*


*ప్రస్తుత విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షను మే 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా మొత్తం 46,937 సీట్లను భర్తీ చేస్తారు.*


*👉వివిధ గురుకులాల్లో సీట్ల వివరాలు*


*▪️సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ సొసైటీ- 18,560*


*▪️గిరిజన సంక్షేమ సొసైటీ- 4,777*


*▪️బీసీ సంక్షేమ సొసైటీ- 20,800*


▪️జనరల్‌ వెల్ఫేర్‌ సొసైటీ- 2800*


*▪️దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌*


*▪️ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా*


*▪️అప్లికేషన్‌ ఫీజు: రూ.100*


*▪️దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 30*


*▪️రాతపరీక్ష: మే 30న*


*▪️వెబ్‌సైట్‌:* Click here

0 Comments