Schedule of Telangana common entrance tests - 2021

 

SCHEDULE OF TELANGANA COMMON ENTRANCE TESTS -2021


తేది. 21.6.2021

పత్రిక ప్రకటన


  • రాష్ట్రంలో ఎమ్సెట్ ప్రవేశ పరీక్షను ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 


  • ఎమ్సెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 4,5,6 తేదీల్లోనూ, ఎమ్సెట్ (అగ్రికల్చర్, మెడికల్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9,10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.


  •  సోమవారం నాడు తన కార్యాలయంలో ప్రభుత్వ కార్యదర్శి సందీపక్కుమార్ సుల్తానియా, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిఠల్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణలతో రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.  



  • కోవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. 



  • ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గారు ఆదేశించినందున ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. 



  • ఈ సందర్భంగా వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి షెడ్యుల్ను విడుదల చేయడం జరిగింది. ఫైనల్ ఇయర్ పరీక్షలను జులైలో పూర్తి చేయాలి.


  • ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లమో ఫైనల్ ఇయర్ పరీక్షలను జులై మొదటి వారంలో నుంచి ప్రారంభించి మాసాంతం లోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను ఆదేశించారు.  



  • విదేశాల్లోనూ, ఇతర చోట్ల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాలకు అనుగుణంగా జూలై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.



  •  ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల బ్యాక్లాగ్లు కూడా జూలై నెలాఖరులోగా పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు.



 ఈ పరీక్షలను కోవిడ్ 19 నిబంధనలకు లోబడి నిర్వహించాలని, ఎక్కడా ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.




SCHEDULE OF TELANGANA COMMON ENTRANCE TESTS -2021


TS CETS.        Test Date for 2021


EAMCET -ENG.   4,5 and 6 August 2021


EAMCET - AM.  9 10 August 2021


ECET.    3-Aug-21


PGECET.   11 to 14 August 2021


ICET.    19th & 20th August 2021


LAWCET.  23-Aug-201


EDCET.     24th & 25th August 2021


POLYCET.  17th July 201 


👉To download PDF click here 👇👇👇👇

Click here



0 Comments