Telangana Education Department plans to implement education teaching with corona care

Telangana Education Department plans to implement education teaching with corona care

                

కరోన జాగ్రత్తలతో విద్య బోధన అమలుకు తెలంగాణ విద్యాశాఖ యోచన



♦️ప్రత్యేకంగా హెల్త్‌ చెకప్‌ రూమ్‌..

️♦️డబుల్‌ మాస్క్‌ఫేస్‌షీల్డు తప్పనిసరి

♦️విదేశాల్లో ఇదే పద్ధతి అమలు



➡️కరోనా మహమ్మారి కారణంగా పిల్లల చదువులు ఆగమవుతున్నాయి.  ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల కంప్యూటర్లుఫోన్లతోనే గడిపేస్తున్నారు.



➡️ గడప దాటి బయటికెళ్తే ఎక్కడ కరోనా బారిన పడతారోన్న భయంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.



 ➡️అదేసమయం లో వారి విద్యాభ్యాసంపైనా దిగులు చెందుతున్నారు. చిన్నారుల భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. 



➡️ఈ క్ర మంలో పిల్లలను కొవిడ్‌ బారి నుంచి కాపాడుతూ.. వా రికి రక్షణతో కూడిన బోధన అందించిబంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్‌టెక్నో స్కూళ్లు ప్రయత్నిస్తున్నాయి. 



➡️తరగతి గదుల రూపురేఖలు మార్చిప్రతి విద్యార్థి ఆరోగ్యంపై వ్యక్తిగత శ్రద్ధ వహించి పాఠాలు చెప్పేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి.



 ➡️కొవిడ్‌ కేసులు భారీ గా తగ్గిన అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికే ప్రాథమికఉన్నత తరగతుల పిల్లలకు గట్టి భద్రతల నడుమ క్లాస్‌రూమ్‌ బోధనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 



➡️ఈ నేపథ్యంలో నగరంలోని కొన్ని పాఠశాలలు ఇదే తరహాలో పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి.



అర్థం కాని ఆన్‌లైన్‌ పాఠాలు..


➡️ప్రైవేట్‌ విద్యాసంస్థలతోపాటు సర్కారు స్కూళ్లలో సైతం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించినా ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. 



➡️ప్రైవేట్‌ పాఠశాలలకు సంబంధించి60 శాతం మంది పిల్లలు పాఠాలను ఆసక్తిగా వినగా.. మిగతా 40 శాతం మంది కంప్యూటర్లుల్యాప్‌టా్‌పలు,స్మార్ట్‌ఫోన్లలో కాలక్షేపం చేసిన పరిస్థితి నెలకొంది.



డబుల్‌ మాస్క్‌ఫేస్‌షీల్డు..

➡️రెండేళ్లుగా పిల్లలు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఉం టుండడంతో వారిలో అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. 



➡️ఈ నెల 15 తర్వాత నుంచి 2021-22 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించిన పక్షంలో తరగతి గది రూపురేఖలు మార్చడంపై ప్రైవేట్‌ విద్యాసంస్థలు దృష్టి సారించాయి.



➡️ ఒక్కో క్లాసుకు 15-20 మందిని భౌతిక దూరం పాటిస్తూ కూర్చోబెట్టడంతోపాటు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా డబుల్‌ మాస్క్‌తోపాటు ఫేస్‌షీల్డును ధ రించి స్కూల్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోనున్నా రు. 



➡️ప్రతి బడిలో హెల్త్‌ చెకప్‌ రూమ్‌,ప్రవేశద్వారం వ ద్ద శానిటేషన్‌థర్మల్‌ స్ర్కీనింగ్‌తోపాటు పిల్లలకు ప్ర త్యేకంగా గంటకోసారి హ్యాండ్‌ శానిటేషన్‌ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.  



ఆలోచిస్తున్న విద్యాశాఖ..


➡️️కొవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్‌టెక్నో స్కూళ్లు చేస్తున్న ఏర్పాట్లను ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చేపట్టే విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.



 ➡️ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏ ర్పాట్లను అమలు చేస్తూ పిల్లలకు బోధించడం కష్టమనిఒకరిద్దరు పిల్లలు నిర్లక్ష్యంగా వ్యవహరించి కొవి డ్‌ బారిన పడితే.. వారి ద్వారా తరగతి మొత్తం వైరస్‌ ఉచ్చుకు చిక్కుకునే ప్రమాదముందని కొందరు అధికారులు ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నట్లు తెలుస్తోంది.


0 Comments