TS intermediate 2nd year results released

 ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల 


తెలంగాణ ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది.

 

పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు.

కరోనా విస్తృతి నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను రద్దు చేస్తూ TS  ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికి  తెలిసిందే.

ఈ మేరకు ఫలితాల వెల్లడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేసింది.

ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించారు. ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇచ్చారు.

 

గతంలో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, Backlogs  ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులను కేటాయించారు. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

 

ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.

 

💥Inter Results కొరకు కింది link క్లిక్ చేయండి.
👇👇

Click here for Results


0 Comments