TS Rationalisation Guidelines 2021


 ఒక్క స్కూలూ మూతపడదు


➡️సున్నా విద్యార్థులున్న స్కూళ్లకూ ఒక టీచర్‌ పోస్టు


➡️స్కూళ్లలో ఉపాధ్యాయుల సర్దుబాటుకే రేషనలైజేషన్‌


➡️సూళ్లు, టీచర్ల హేతుబద్ధీకరణకు జీవో 25 జారీ


👉పాఠశాలలను మూసివేయాల్సిన అవసరం లేకుండానే హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క స్కూలు కూడా మూసివేయకుండా టీచర్లను సర్దుబాటును చేయాలని భావిస్తున్నది.


 👉విద్యార్థులు లేని స్కూళ్లకు కూడా ఒక సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ) పోస్టును కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. టీచర్ల హేతుబద్ధీకరణకు అనుమతిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జీవో- 25 జారీచేశారు.


 👉ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌ యాజమాన్యాల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది హేతుబద్ధీకరణ కోసం మార్గదర్శకాలను జారీచేశారు. 


👉ఈ ప్రక్రియలో కొత్త పోస్టుల మంజూరు, ఉన్న పోస్టుల రద్దు ఉండదని స్పష్టంచేశారు. ఏ యాజమాన్యం వారికి ఆ యాజమాన్యం ఆధారంగానే రేషనలైజేషన్‌ చేస్తారు. 2019-20 యూడైస్‌ ఆధారంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయ నిష్పత్తిని నిర్ధారిస్తారు. 


👉ఇదే విధానంతో మిగులు పోస్టులు, అవసరమయ్యే టీచర్‌ పోస్టులను నిర్ధారించనున్నారు. జిల్లా స్థాయిలో హేతుబద్ధీకరణ ఉత్తర్వుల్లో ఏవైనా సమస్యలుంటే డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు అప్పీలు చేసుకోవచ్చు. ఉత్తర్వులు అందుకున్న 10 రోజుల్లో అప్పీల్‌ చేసుకోవాలి. 


👉బడుల హేతుబద్ధీకరణను జిల్లాస్థాయి కమిటీ చేపడుతుంది. జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, జిల్లా పరిషత్‌ సీఈవో, ఐటీడీఏ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి సభ్యులుగా ఉంటారు.*


ఇవీ మార్గదర్శకాలు..


👉ఒకే ప్రాంగణంలో రెండు అంతకు మించి స్కూళ్లు ఉంటే వాటిని విలీనం చేస్తారు. ప్రాథమిక పాఠశాలను మరో ప్రాథమిక పాఠశాలలో, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలను అదే ప్రాంగణలోని మరో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు.*


👉ఒకే ప్రాంగణంలో రెండు అంతకు మించి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలుంటే వాటిని విలీనం చేసి 1-7 తరగతులు బోధిస్తారు.


👉ఒకే ప్రాంగణంలో రెండు అంతకంటే ఎక్కువ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలుంటే ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాలను వేరుచేసి, 1-5 తరగతులు నిర్వహిస్తారు. 6,7 తరగతులను ఉన్నతపాఠశాలలో విలీనం చేయనున్నారు.


👉ఒకే ప్రాంగణంలోని రెండు అంతకు మించి వేర్వేరు యాజమాన్యం (ప్రభుత్వ, పంచాయితీరాజ్‌), వేర్వేరు మాధ్యమాలు (తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ) పాఠశాలలుంటే వాటిని విలీనం చేసి ఒకే యాజమాన్యం, ఒకే మీడియం స్కూల్‌గా నడపనున్నారు.*


 👉సీనియార్టీ పరంగా జూనియర్‌ అయిన టీచర్‌ను మిగులు ఉపాధ్యాయుడిగా పరిగణించి బదిలీచేస్తారు. సీనియర్‌ టీచర్లు బదిలీ అయ్యేందుకు సిద్ధపడితే అవకాశమిస్తారు. అంధులు, 8 ఏండ్ల సర్వీసు పూర్తికానివారిని మిగులు టీచర్లుగా పరిగణించరు. రేషనలైజేషన్‌లో పోస్టు లేకపోతే అంధ టీచర్లను సైతం బదిలీచేస్తారు.


👉వీలిన ప్రక్రియలో బాలికల ఉన్నత పాఠశాలను అలాగే కొనసాగిస్తారు.


👉 150కంటే ఎక్కువమంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకే లో ఫిమేల్‌ లిటరేచర్‌ (ఎల్‌ఎఫ్‌ఎల్‌) హెచ్‌ఎం పోస్టు కేటాయిస్తారు. అంతకన్నా తక్కువ ఉంటే ఎస్జీటీతో సర్దుబాటుచేస్తారు.


👉 ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్‌ఏ గణితం/ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, ఇంగ్లిష్‌ టీచర్లు గ్రేడ్‌-1, గ్రేడ్‌- 2 భాషాపండితులు ఉంటారు.

👉Download your school U-Dise(2019-20) Report here👇👇👇👇

Click here

0 Comments