PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >


 Ap grama sachivalayam jobs final keys released


Ap గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీ కోసం జరిగిన పరీక్షల final keys విడుదల చేయడం జరిగింది.

   ఆ పరీక్షల keys ని డౌన్లోడ్ చేుకోవాలనుకుంటున్నారా అయితే కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇

           Final Keys

     

Share on:

 Tsspdcl JLM 3 districts provisional selection list



     Tsspdcl JLM ఎగ్జామ్ 2019 లో రాసి విజయవంతంగా పోల్ క్లైమ్బింగ్ పూర్తి చేసిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరిగింది. 

ఆ provisional selection లిస్టులు జిల్లాల వారీగా చూడడానికి కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇

     Mbnr list


      NGKL list


  Narayanpet list

Share on:

 :-ఆస్తుల ఆన్ లైన్  సందేహాల సమాధానాలు:-


*👉వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌పై ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలు.. వాటికి సమాధానాలు.*



*🤔 ఆన్‌లైన్‌ చేసుకోవడానికి*

       *ఎవరిని సంప్రదించాలి?ఎంత ఫీజు* *కట్టాలి?*


       _*💧ఇంటిని ఆన్‌లైన్‌ చేసుకోవడానికి ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకొంటారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిపన్ను, నల్లా పన్ను మొదలైనవి బకాయి ఉంటే వాటిని చెల్లిస్తే సరిపోతుంది.*_



*🤔 ఆన్‌లైన్‌ కోసం ఎలాంటి*

       *డాక్యుమెంట్లు కావాలి.*

       *వాటిని చూపిస్తే సరిపోతుందా?*


       _*💧ఇంటిని ఆన్‌లైన్‌ చేయడానికి  అధికారి వచ్చినప్పుడు యాజమాని ఆధార్‌కార్డుతో పాటు వ్యవసాయ భూముల పట్టాదారు పాసుపుస్తకం చూపించాలి. ఇంటినంబర్‌/ పట్టాదారు పాసుబుక్‌ వివరాలు యాప్‌లో నమోదు చేయగానే మీకు సంబంధించిన వివరాలన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఎలాంటి డాక్యుమెంట్‌ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పట్టాదారు పాసుపుస్తకాలు లేనివారు ఆధార్‌కార్డుతో పాటు ఉపాధి హామీ కార్డు/ రేషన్‌ కార్డు/ పెన్షన్‌ కార్డు/ జీరో అకౌంట్‌లలో ఏదైనా ఒకటి చూపిస్తే చాలు.*_



*🤔 ఇంటిని కొలిచేటప్పుడు*

       *యజమాని తప్పని సరిగా*

       *ఉండాలా?*


       _*💧యజమాని ఉంటే వివరాలు సమగ్రంగా నమోదుచేయడానికి వీలవుతుంది. ఎలాంటి అనుమానాలు కలిగినా వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. కచ్చితంగా రాలేని పరిస్థితి ఉంటే బంధువులు లేదా అద్దెకు ఉంటున్నవారి సహాయంతో వివరాలు అందజేయాలి.*_



*🤔 ఇల్లు లేకుండా స్థలం మాత్రమే*

       *ఉంటే దాన్ని ఆన్‌లైన్‌*

       *చేస్తారా? దానికోసం ఎలాంటి*

       *డాక్యుమెంట్లు కావాలి?*


       _*💧ఇల్లు లేకుండా స్థలం మాత్రమే ఉంటే దాన్ని ఆన్‌లైన్‌ చేయరు. భవిష్యత్‌లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆన్‌లైన్‌లోకి ఎక్కించి పాస్‌బుక్‌ జారీ చేస్తారు. అక్రమ లేఅవుట్‌, వ్యవసాయ భూమిలో ప్లాట్‌ కొంటే దాన్ని ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇండ్లను మాత్రమే ఆన్‌లైన్‌ చేస్తున్నారు.*_



*🤔 యాజమాని చనిపోయి ఉంటే*

       *వారసులందరి పేర్లు నమోదు*

       *చేసుకుంటారా? వారిలో*

       *ఒక్కరే గ్రామంలో ఉంటూ*

       *మిగిలిన వారు వేరే ప్రాంతాల్లో*

       *ఉంటే ఎలా?*


       _*💧రికార్డుల్లోఉన్న ఇంటి యాజమాని మరణిస్తే అతడి భార్య లేదా పిల్లల పేరుమీద ఆన్‌లైన్‌ చేస్తారు. వారసులు ఎంతమంది ఉన్నారో తెలుసుకొని అందరికీ జాయింట్‌ ఓనర్‌షిప్‌ ఇస్తారు. వారసుడు ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకున్నాకే ఆన్‌లైన్‌ చేస్తారు. ఒకవేళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్తిని ఒక్కరి పేరు మీదే రాయాలని డిక్లరేషన్‌ ఇస్తే ఆ ఒక్కరి పేరుమీద చేస్తారు. వారసులం అని నిరూపించుకోవడానికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.*_


*🤔 ఆస్తులను ఎందుకు ఆన్‌లైన్‌*

       *చేస్తున్నారు. కార్యక్రమం*

       *ముఖ్య ఉద్దేశం ఏమిటి?*


       _*💧వ్యవసాయ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నట్టే.. వ్యవసాయేతర ఆస్తులకూ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్లతోపాటు, ఇతర ఖాళీస్థలాలపై యాజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించడంతోపాటు వాటికి రక్షణ కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశం. పంచాయతీ/ మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఉన్న రికార్డు ఆధారంగా ఇండ్లను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఇల్లు ఎవరిది? ఎవరి నుంచి ఎవరికొచ్చింది? తర్వాత వారసులెవరు? తదితర వివరాలను ఆన్‌లైన్‌చేసి.. వాటిని మెరూన్‌ రంగు పాస్‌బుక్‌లో ము ద్రించి ఇస్తారు. దీంతో ఏండ్లుగా ఉన్న ఆస్తి వివాదాలకు చెక్‌ పడటంతోపాటు, భవిష్యత్తులో క్రయవిక్రయాలు సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి.*_


*🤔 అధికారులు ఇంటికి రాకపోతే..?*


       _*💧పంచాయతీ లేదా మున్సిపాలిటీ సిబ్బంది ప్రతి ఇంటికీ తిరిగి వివరాలను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఒకవేళ ఎవరూ రాలేదని భావిస్తే.. పంచాయతీ కార్యాలయం లేదా మున్సిపాలిటీ ఆఫీస్‌కు వెళ్లి విషయాన్ని వివరించాలి. సిబ్బంది వచ్చి వివరాలు సేకరిస్తారు.*_



*🤔 కుటుంబసభ్యుల వివరాలు*

       *చెబితే చాలా? వారికి*

       *సంబంధించిన డాక్యుమెంట్లు*

       *ఏమైనా ఇవ్వాలా?*

 

       _*💧పదేండ్ల వయస్సు పైబడిన కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేయించడానికి ఆధార్‌నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని అధికారులు యాప్‌లో పొందుపరుస్తారు. పదేండ్లలోపు వారికి మినహాయింపు ఉంటుంది. యాజమాని కోరితే పిల్లల వివరాలు సైతం నమోదుచేస్తారు.*_


*🤔 ఇంటితోపాటు ఇంటిముందు,*

       *వెనకాల ఉన్న స్థలాన్ని*

       *కూడా ఆన్‌లైన్‌ చేస్తారా?*

       *పెరడు ఒకదగ్గర ఇల్లు*

       *మరో దగ్గర ఉంటే ఏంచేయాలి?*


       _*💧ఇంటితోపాటు ఇంటిముందు, వెనకాల ఉన్న స్థలాలను సైతం ఆన్‌లైన్‌ చేస్తారు. పంచాయతీ రికార్డుల్లో గతంలోనే ఈ వివరాలు  ఉంటాయి. మొత్తం ఖాళీస్థలం (ప్లాట్‌ ఏరియా), అందులో ఉన్న ఇంటి స్థలం (ప్లింత్‌/ బిల్డప్‌ ఏరియా) అని నమోదు చేస్తారు. గత రికార్డుల్లో ప్లాట్‌ ఏరియా (పెరడు)కు సంబంధించిన వివరాలు లేకపోతే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకొని ఇంటిస్థలంతోపాటు ఆ స్థలాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కిస్తారు. పెరడు ఒకదగ్గర ఇల్లు మరో దగ్గర ఉన్నా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ అవసరం. ఒకవేళ ఆ పెరడులో పశువుల కొట్టం, రేకుల షెడ్డు లేదా ఏదైనా నిర్మాణం ఉంటే దానికి ఇంటి నంబర్‌ కేటాయించి.. ఆన్‌లైన్‌ చేస్తారు.*_


*🤔 ఖాళీ స్థలంతోపాటు ఇంటి*

       *వివరాలు తీసుకున్నప్పడు*

       *రెండింటిమీద పన్ను వసూలు*

       *చేస్తారా?*


       _*💧పంచాయతీల్లో గతంనుంచీ ఈ రెండింటికీ కలిపి ఒక్కటే పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వసూలు చేసేదేమీ ఉండదు. ఒకవేళ రికార్డుల్లో లేని భూమిని సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో ఇంటి స్థలంలో కలిపి ఆన్‌లైన్‌ చేసుకున్నట్లయితే అదనంగా కలిసిన భూమికి అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రెండింటినీ కలిపితే పన్ను పెరిగిపోతుందనేది ఆపోహ మాత్రమే.*_



*🤔ఎలాంటి డాక్యుమెంట్లులేని*

       *ఇండ్లను ఆన్‌లైన్‌ ఎలా*

       *చేస్తారు? కొత్తగా నిర్మించుకున్న వారి* *పరిస్థితి ఏమిటి?*


       _*💧వాస్తవంగా ప్రతి ఇల్లూ రికార్డుల్లో ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇంటి నంబరుకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తారు. రెండుమూడ్రోజుల్లో ఇంటి నంబర్‌ కేటాయించి యాజమాని వివరాలను ఈ- పంచాయతీ/ సీడీఎంఏ వెబ్‌సైట్‌లోకి ఎక్కించి తరువాత యాప్‌లో ఆన్‌లైన్‌ చేస్తారు. కొత్తగా నిర్మించిన, నిర్మాణంలోఉన్న ఇండ్లకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.*_



*🤔 ప్రభుత్వ భూమిలో ఇండ్లు*

       *కట్టుకొని ఉంటున్నవారి*

       *వివరాలను సేకరిస్తారా?*


       _*💧సర్కారు జాగాను ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నట్టు తేలితే ప్రభుత్వభూమిగా నమోదు చేస్తారు. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇప్పటికే 58, 59 జీవో కింద కొన్ని ఇండ్లను ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేసింది. మరోసారి రెగ్యులరైజేషన్‌కు అవకాశమిచ్చేందుకు సిద్ధమవుతున్నది. అప్పటికీ వినియోగించుకోకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.*_



*🤔 ఇల్లు కట్టుకొని రికార్డుల్లో*

       *నమోదు చేసుకోకుండా*

       *ఉంటే పరిస్థితేమిటి?*


       _*💧గుర్తింపులేని ఇండ్లు/ భవనాలు ఏవైనా ఉంటే వెంటనే మున్సిపల్‌/ పంచాయతీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆదేశిస్తారు. రెండుమూడ్రోజుల్లోగా పీటీఐఎన్‌ లేదా అసెస్‌మెంట్‌ నంబర్‌ ఇస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ చేస్తారు.*_



*🤔 గతంలో నివాసానికి వాడుకున్న*

       *ఇంటిని ఇప్పుడు కమర్షియల్‌గా*

       *మారిస్తే పన్ను స్లాబ్‌*

       *మారుతుందా?*


       _*💧ఇల్లు లేదా ప్లాటు ఏ ప్రాంతంలో ఉంది? ఎంత విస్తీర్ణంలో ఉన్నది? బిల్డప్‌ ఏరియా ఎంత? దానినెలా ఉపయోగిస్తున్నారు? వంటి అంశాలపై ఆ పన్ను ఆధారపడి ఉంటుంది. ప్రధాన కూడళ్లు, రద్దీప్రాంతాల్లో ఉండే భవనాలలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నవారు ఎందరో ఉన్నారు. మరికొందరు గతంలో బిల్డప్‌ ఏరియాను తక్కువగా చూపించుకున్నారు. ఇలాంటివన్నీ తాజా సర్వేతో బయటపడుతాయి. వారికి పన్ను పెరిగే అవకాశం ఉంటుంది.*_



*🤔 అనుమతి లేకుండా*

       *పైఅంతస్తులు కట్టుకున్నవారిపై*

       *చర్యలు ఉంటాయా?*


       _*💧ఇంటి అనుమతులు తీసుకునే సమయంలో ఇచ్చిన ప్లాన్‌కు మించి కట్టినట్టు తేలితే.. జరిమానాగా 50శాతం అదనంగా పన్ను విధిస్తారు. అనుమతుల్లేకుండా పైఅంతస్తులు కట్టినట్టు తేలితే జరిమానాగా పన్నును రెట్టింపు చేస్తారు. జీవితాంతం ఈ జరిమానా కట్టాల్సి ఉంటుంది. యజమాని ఇంటి కొలతలను తప్పుగా చెప్పినా.. అసెస్‌మెంట్‌లో తేలిపోతుంది.*_



*🤔 మా ఇంటికి పన్ను మారుతుందా?*


       _*💧వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వద్దే ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువను నమోదు చేయాలని ధరణి పోర్టల్‌లో తాజాగా ఆదేశించింది. సర్వేనంబర్‌, ఇంటి నంబర్ల వారీగా మార్కెట్‌ విలువను నిర్ధారిస్తారు. మొదట రోడ్లు, ఇతర వాణిజ్య స్థలాలకు దగ్గరగా ఉండే ఆస్తులను హయ్యర్‌ వాల్యూగా.. మిగతావాటిని లోయర్‌ వాల్యూగా నిర్ధారిస్తారు. వీటికి తాజాగా ధరలను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త ధరల ఆధారంగా మార్కెట్‌ వాల్యూ మారుతుంది. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు, పన్నులపై వీటి ప్రభావం ఉంటుంది.*_



*🤔 ఇల్లు కొనుగోలు చేశాక కూడా*

       *రికార్డుల్లో పాత యాజమాని*

       *పేరు ఉంటే?*


       _*💧అలాంటివారిని వెంటనే మున్సిపల్‌/ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పేరు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. నిబంధనల ప్రకారం మార్పిడి జరిగిన తర్వాత ఆన్‌లైన్‌ చేస్తారు.*_



*🤔 కూలిపోయిన ఇండ్లకు*

       *అసెస్‌మెంట్‌ చేస్తారా?*


       _*💧కూలిపోయిన ఇండ్లకు    ఇప్పటికే ఇంటి నంబర్‌/ పీటీఐఎన్‌ నంబర్‌ ఉంటుంది. కాబట్టి ఆ ఇంటిని అసెస్‌మెంట్‌ చేస్తారు. నిర్మాణం సగంలో ఆగిపోయిన ఇండ్లకు ఇంటి నంబర్‌ మంజూరుకాదు కాబట్టి ఆన్‌లైన్‌ చేయరు.*_



*🤔 బావుల వద్ద, వ్యవసాయ*

       *భూమిలో ఇల్లు కట్టుకుంటే*

       *ఎలా?*


       _*💧వ్యవసాయ భూముల్లో కట్టుకున్న ఇండ్లను ఆన్‌లైన్‌ చేసేప్పుడు అది పట్టాల్యాండ్‌లో ఉంది అని ధ్రువీకరించి ఆన్‌లైన్‌ చేస్తున్నారు.*_



*🤔 వ్యక్తిగత వివరాలు ఇస్తే*

       *గోప్యంగా ఉంటాయా?*


       _*💧భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వలక్ష్యం. రికార్డులన్నీ పక్కాగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. వ్యవసాయ భూముల రికార్డులు దాదాపు క్లియర్‌గా ఉన్నాయి. వ్యవసాయేతర భూముల వివరాలు కూడా క్లియర్‌గా ఉండాలనే ఈ ప్రక్రియను చేపట్టారు. ఇంటియాజమానితోపాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనే వివరాలు తీసుకుంటున్నారు. కుటుంబానికి సంబంధించిన సమాచారం మొత్తం మెరూన్‌ పాస్‌బుక్‌లోకి చేరుతుంది. దీంతో వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.*_



*🤔 ఇంటిని ఇద్దరు వారసులు*

       *పంచుకుంటే దానిని ఎవరి*

       *పేరుమీద నమోదు చేస్తారు?*

       *ఒకరు కాస్తులో, మరొకరు*

       *పట్టాలో ఉంటే?*


       _*💧ఒకే ఇంటిని వారసులు పంచుకుంటే వేర్వేరు నంబర్లు కేటాయించి.. ఎవరిది వారికే ఆన్‌లైన్‌ చే స్తారు. పంచుకున్నాక కూడా కాస్తులో ఒకరు పట్టాలో ఒకరు ఉంటే ఆ ఆస్తి ఎవరికి చెందిందో ఆ ఇద్దరు కలిసి ఇచ్చే డిక్లరేషన్‌ ఆధారంగా ప్రక్రియను పూర్తి చేస్తారు.*_



*🤔 మున్సిపాలిటీల్లోని మురికివాడల్లో*

       *ఇంటి వివరాలను ఎలా*

       *సేకరిస్తున్నారు? పట్టాలు లేని*

       *ఇండ్లను కూడా నమోదు*

       *చేస్తారా?*


       _*💧మురికివాడల్లోని ఇండ్లకు పీటీఐఎన్‌ నంబర్‌ ఆధారంగా అసెస్‌మెంట్‌ చేస్తున్నారు. వాటి విస్తీర్ణం వివరాలు ఇప్పటికే నమోదయ్యాయి. అదనంగా కుటుంబసభ్యుల వివరాలు, నల్లా, ఇంటి కనెక్షన్‌ వంటివి మాత్రమే సేకరిస్తారు.*_



*🤔 పీటీఐఎన్‌ నంబర్‌లేని*

       *ఇండ్లను ఎలా నమోదు*_

       *చేస్తారు? కొత్తగా పీటీఐఎన్‌*

       *నంబర్‌ ఇస్తారా?*


       _*💧పీటీఐఎన్‌ నంబర్‌లేని ఆస్తుల వివరాలు సైతం నమోదుచేయాలని పురపాలకశాఖ ఆదేశించింది. ఆస్తికి సంబంధించిన పత్రాలు, వివరాలతోవారు పీటీఐఎన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్‌ వచ్చాక కుటుంబసభ్యుల వివరాలు అప్‌లోడ్‌ చేయవచ్చు.*_



*🤔 బినామీ ఆస్తులు*

       *బయటపడుతాయా?*


       _*💧నిబంధనల ప్రకారం ఇల్లు ఎవరి పేరుమీద ఉన్నదో వారికే శాశ్వత హక్కులు కలుగుతాయి. తాజా సర్వేతో తర్వాతితరం వివరాలు కూడా నమోదవుతాయి. ఒకవేళ ఎవరికైనా బినామీ ఆస్తులు ఉంటే.. వాటిని తరతరాలుగా వేరేవ్యక్తులకు అప్పగించరు. కాబట్టి బినామీలకు ఆస్కారం ఉండదు. ఆస్తిని అమ్మితే వెంటనే లావాదేవీల వివరాలు ప్రభుత్వానికి తెలిసిపోతాయి. అనుమానం వస్తే విచారణ జరుగుతుంది.*_



*🤔 నమోదు సమయంలో యాజమాని*

       *కచ్చితంగా ఉండాలా? దూరంగా*

       *ఉన్న, వలస వెళ్లినవారి పరిస్థితి*

       *ఏంటి?*


       _*💧యాజమాని ఊర్లో లేకుంటే.. ఫోన్‌లో వివరాలు తెలిపినా ఆన్‌లైన్‌ చేస్తారు. వలసవెళ్లిన వారికి ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇప్పటికే ప్రతి ఆస్తికి సంబంధించి యజమాని ఫోన్‌ నంబర్లు పంచాయతీ/ మున్సిపాలిటీల వద్ద ఉన్నాయి. లేనివారి వివరాలు సేకరించి వారికి సమాచారమిస్తారు. అపార్ట్‌మెంట్లు/ గేటెడ్‌ కమ్యూనిటీ అయితే సమాచారమిచ్చే బాధ్యతను అసోసియేషన్‌ కూడా పంచుకుంటుంది. ఒకవేళ యాజమానికి సమాచారమే లేదు. ఆన్‌లైన్‌ చేసుకునేందుకు రాలేదు. అంటే వారికి మరో అవకాశం ఉంటుందా అనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు.*_



*🤔 కులం వివరాలు ఎందుకంటే?*


       _*💧గ్రామంలో ప్రజల సాంఘిక స్థితిగతులు ప్రభుత్వానికి తెలుస్తాయి. కులాలవారీ జనాభా, వారి ఆర్థికస్థితిగతులపై మరింత స్పష్టత వస్తుంది. తద్వారా కరెంటు, నల్లా కనెక్షన్లు, ఆస్తిపన్నులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు నేరుగా అర్హులకు అందే అవకాశం ఉంటుంది.*_



*🤔 జీహెచ్‌ఎంసీ పరిధిలో*

       *ఆన్‌లైన్‌ ఎలా చేస్తున్నారు?*

       *ఏమేం డాక్యుమెంట్లు అవసరం?*


       _*💧జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే దాదాపు అన్నిఇండ్ల వివరాలు సీడీఎంఏ పోర్టల్‌లో నమోదై ఉన్నాయి. వారందరికీ పీటీఐఎన్‌ (ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) ఇచ్చారు. ఇతర వివరాలు నమోదు చేయాలనుకునేవారికోసం యజమాని ఫోన్‌నంబర్‌కు ప్రత్యేకంగా వెబ్‌ లింక్‌ను పంపుతున్నారు. దాని ఆధారంగా మీసేవ పోర్టల్‌లో వివరాలను సరిచూసుకోవచ్చు. ఆ ఇంటికి సంబంధించిన అదనపు వివరాలు, కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయొచ్చు. చివరగా ఇంటి యజమాని ఫొటోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సొంతంగా వివరాలు అప్‌లోడ్‌ చేసుకునేందుకు     లింక్‌ను సందర్శించవచ్చు.*_



*🤔 కరెంటు, నల్లా కనెక్షన్‌*

       *వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు?*


       _*💧ఇంటికి కనీస అవసరాలైన కరెంటు, నల్లా కనెక్షన్లు లేవని తేలితే వాటిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక గ్రామంలో/మున్సిపాలిటీలో కరెంటు, నీటి వినియోగంపై స్పష్టత వస్తుంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లుచేసేందుకు వీలు కలుగుతుంది.*_



*🤔 ఆన్‌లైన్‌ చేయకపోతే*

       *ఏమవుతుంది?*


       _*💧ఆన్‌లైన్‌ చేయకపోతే ఆ ఆస్తి వివరాలు ధరణి పోర్టల్‌లో నమోదు కావు. అంటే దానికి ప్రభుత్వ గుర్తింపు ఉండదు. భవిష్యత్తులో మార్పిడులు, రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు.*_



*🤔 అన్ని వివరాలను ధరణిలో*

       *అప్‌లోడ్‌ చేస్తారా?*


       _*💧వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలన్నీ ధరణి పోర్టల్‌లో నమోదు కానున్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న వివరాలన్నీ పోర్టల్‌కు అనుసంధానమవుతాయి. తద్వారా భవిష్యత్‌లో క్రయవిక్రయాలు సులభంగా జరుగుతాయి.*_



*🤨 ఆన్‌లైన్‌లో ఆస్తి నమోదుకు*

       *కావాల్సిన వివరాలు*


★ _*యాజమాని పేరు*_


★ _*తండ్రి/భర్త పేరు*_


★ _*వయసు*_


★ _*జెండర్‌ (లింగం)*_


★ _*ఫోన్‌ నంబరు*_


★ _*పట్టాదారు పాసుబుక్‌ ఉందా*_

     _*లేదా*_


★ _*పాస్‌బుక్‌ లేని పక్షంలో ఇతర*_

     _*గుర్తింపు కార్డులు*_


★ _*ఆధార్‌నంబరు*_


★ _*యాజమాని ఫొటో*_


★ _*ఆస్తికి జాయింట్‌ ఓనర్లు ఉన్నారా*_


★ _*జాయింట్‌ ఓనర్‌ పేరు /*_

     _*ఆధార్‌ నంబరు/ మొబైల్‌ నంబరు*_


★ _*ఆస్తికి సంబంధించిన వివరాలు*_


★ _*టీపీఐఎన్‌*_


★ _*ఇంటి నంబరు*_


★ _*ప్రాంతం*_


★ _*ఏ రకమైన ఆస్తి, ఎలా*_

     _*సంక్రమించింది..(వారసత్వం/*_

     _*కొనుగోలు/ దానం/ పంపకం)*_


★ _*ప్లాట్‌ మొత్తం ఎన్ని స్వేర్‌*_

     _*యార్డులు*_


★ _*అందులో నిర్మాణంఉన్న స్వేర్‌*_

     _*యార్డులు*_


★ _*అన్‌ డివైడెడ్‌ ఏరియా ఎంత*_


★ _*నిర్మాణం దేనికి వాడుతున్నారు*_

     _*(ఇండిపెండెంట్‌ హౌజ్‌/*_

     _*అపార్ట్‌మెంట్‌/ కమర్షియల్‌*_

     _*భవనం)*_ 


★ _*భూమి ఏ రకం.. ప్రైవేటు*_

     _*భూమి/ ప్రభుత్వ భూమి/*_

     _*ఆబాదీ (గ్రామ కంఠం) /అసైన్డ్‌*_


★ _*సర్వే నంబరు*_


★ _*రెవెన్యూ విలేజ్‌*_


★ _*విద్యుత్‌ కనెక్షన్‌ నంబరు*_


★ _*నీటి సరఫరా నంబరు*_


★ _*చిరునామా*_


★ _*కుటుంబ సభ్యుల వివరాలు,*_

     _*వారి ఆధార్‌ నంబర్‌*_



*🤗 మున్సిపాలిటీల్లో అదనంగా*

       *సేకరించే వివరాలు*


★ _*శాశ్వత చిరునామా*_


★ _*పస్తుత చిరునామా*_


★ _*నిషేధిత ఆస్తిలో ఉన్నదా? లేదా?*_


★ _*మెయిల్‌ ఐడీ*_



*ఆన్‌లైన్‌తో లాభాలివీ*


★ _*వ్యవసాయేతర ఆస్తులు, కుటుంబం*_

     _*వివరాలన్నీ ప్రభుత్వం వద్ద*_

     _*ఉంటే పంపకాల సమయంలో*_

     _*గొడవలకు ఆస్కారం ఉండదు.*_

     _*కుటుంబం ఇచ్చే డిక్లరేషన్‌తో*_

     _*పంపకాలు సులువుగా*_

     _*జరుగుతాయి. తద్వారా*_

     _*ఆ ఆస్తికి ప్రభుత్వం రక్షణగా*_

     _*ఉంటుంది.*_


★ _*రికార్డులన్నీ డిజిటలైజ్‌ కావడంతో*_

     _*తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించే*_

     _*అవకాశం ఉండదు.*_


★ _*కులం వివరాలు సేకరించడం*_

     _*ద్వారా సామాజిక, ఆర్థిక*_

     _*పరిస్థితులపై ప్రభుత్వానికి*_

     _*స్పష్టత ఉంటుంది.*_


★ _*సబ్సిడీలు వంటివి ఏ ఇంటికి*_

     _*చేరుతున్నాయో తెలుస్తుంది.*_


★ _*కరెంటు, నల్లా కనెక్షన్ల*_

     _*వివరాలు తెలుసుకోవడం ద్వారా*_

     _*కనెక్షన్లు లేనివారికి వాటినందించే*_

     _*వీలుంటుంది.*_


★ _*గృహ అవసరాల కోసం*_

     _*అనుమతి తీసుకొని కమర్షియల్‌గా*_

     _*వాడటం, నిబంధనలకు*_

     _*విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు*_

     _*బయటపడుతాయి.*_


★ _*ఏ గ్రామం/పట్టణంలో అవసరాలు*_

     _*ఎంత? భవిష్యత్తులో ఎంత*_

     _*అవసరం పడొచ్చు వంటి*_

     _*వివరాలపై ఓ అంచనా*_

     _*వస్తుంది. దానికి అనుగుణంగా*_

     _*వసతుల కల్పన జరుగుతుంది.

Share on:


TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్

            

మళ్ళీ కేసు November 10 కు వాయిదా పడింది పూర్తి వివరాలకు కింద లింక్ ఓపెన్ చేసి చూడండి

👉 అప్డేట్  ఎలా చూడలో ఇక్కడ చూడండి👇👇

➡️ మొదటగా కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి హైకోర్టు వెబ్సైట్ కు వెళ్తారు

➡️ అక్కడ మీరు  Case type దగ్గర WP అని టైప్ చేయండి…NEXT.  Case  number దగ్గర 5676 టైప్ చేేయండి.  Next. Year దగ్గర 2020 అని టైప్ చేేయండి

అక్కడ ఉన్న capch టైప్ చేయండి.తరువాత submit press చేస్తే మీకు పూర్తి deatlis వస్తాయి


పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇


             CLICK HERE          


Share on:

  know your Group 4 hall ticket number and TSPSC ID 


మీ యొక్క రిజల్ట్ చూసుకోవడం  కొరకు  Hallticket number లేనివారు ఈ క్రింది లింక్ లో

 👉Notification No. Group IV 10/2018,

 👉మీ TSPSC ID,

 👉Date of birth enter చేసి తెలుసుకొనవచ్చు. 

Link👇👇👇


       CLICK HERE


ఒకవేళ మీ TSPSC ID కూడా తెలియనట్లయితే ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి 

👉మీ Aadhar Number, 

👉Date of Birth

 enter చేసి తెలుసుకొనవచ్చు.

        link👇👇👇👇


             CLICK HERE


👉 # *Always save ur Hallticket and application form* in ur mail or laptop or mobile etc..

 👉Don't neglect. Anything may happen. 

👉Don't lose hope . 

👍Gd luck 👍.



Share on:

 

Tspsc  నుండి గ్రూప్ 4 ఫలితాలు విడుదల


👉Tspsc నుండి గ్రూప్ ఫలితాలు విడుదల చేసారు 1595 ఉద్యోగాలు 2018 లో నోటిఫికేషన్ విడుదల చేసారు.

👉 దానికి సంబంధించిన పూర్తి ఫలితాలు ఈ రోజు విడుదల చేసారు.


👉Group 4 ఫలితాలు కోసం కింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇👇

          Click here

               

Share on:

 

Telangana EAMCET result 2020

      

Telangana EAMCET result 2020 released

Click here to get the EAMCET results 👇👇


👉To subscribe my channelClick here

     



                         Click here


               


       


                     

Share on:

 


సర్వీసు రిజిష్టరు పోయిన/జాడ తెలియని సందర్భాలలో పునర్నిమాణం ఎలా చేయాలి??*


👉 సర్వీసు రిజిష్టరు ఉద్యోగికి ఆయువు పట్టులాంటిది. దానిలో నమోదు చేసిన విషయాల ఆధారంగానే ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత రావలసిన అన్ని రకాల ఆర్ధిక సౌలభ్యాలు పొందు అవకాశం ఉంది.


👉 అట్టి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సర్వీసు రిజిష్టరు ఏ కారణం  చేతనైనా పోయినా, కనిపించకపోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా,అట్టి సర్వీసు రిజిష్టరు మరల ఎలా పునర్నిర్మాణం (Rebuilt or Reconstruction) అను విషయమై ప్రభుత్వం *G.O.Ms.No.202 F&P తేది:11.06.1980* ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.


👉 ఉద్యోగి నిర్వహించుచున్న నకలు(Duplicate) సర్వీసు రిజిష్టరులో నమోదు చేయబడి అటెస్టు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాలు సంబంధిత రికార్డ్స్ తోనూ, పేబిల్స్, వేతన స్థిరీకరణ పత్రములు,GIS, GPF,TSGLI,పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీచేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీచేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీసు రిజిష్టరు పునర్నిర్మాణం చేయవచ్చు.


👉 ఈ విషయంలో నకలు(Duplicate S.R) రిజిష్టరు చట్ట బద్ధమైనదిగా పరిగణించబడదు.


👉 అదే విధంగా ఉద్యోగి తన సర్వీసు విషయాలను గురించి ప్రమాణ పూర్వకంగా సంతకం చేసి వ్రాసిచ్చిన వాంగ్మూలము (Affadavit as attested) పరిశీలించి,అట్టి విషయములను సమాంతర(Collateral) ఉద్యోగుల సాక్ష్యాదారాలు ఉన్న పక్షమున అంగీకరించి పునర్నిర్మాణం చేయుచున్న సర్వీసు రిజిష్టరు లో నమోదుచేయాలి *G.O.Ms.No.224 F &P తేది:28.8.1982*


👉 పుట్టినతేది,ఉద్యోగ నియామకం,తదితర అంశాలకు సంబంధించిన ఉద్యోగి చెంతనున్న  వివరాల ఆధారంగా నమోదు చేయవచ్చు. 

అదే విధంగా కార్యాలయంలోనూ, పై అధికారుల కార్యాలయంలోనూ అందుకు సంబంధించిన కాపీల ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.


👉 ఇంక్రిమెంటు రిజిష్టరు కార్యాలయంలో నిర్వహిస్తున్న యెడల,అట్టి రిజిష్టరు ఆధారంగా విషయాలు నమోదు చేయవచ్చు.


👉 పుట్టినతేది,విద్యార్హతలు, ఉద్యోగి ఇతరత్రా వివరాలు  విద్యాశాఖవారు జారీచేసిన సర్టిఫికెట్స్ ఆధారంగా సరిచూచి సర్వీసు రిజిష్టరులో నమోదు చేయవచ్చు.

         అదేవిధంగా ఉద్యోగం కోసం సర్వీసు కమీషను వారికి అభర్ధి పెట్టుకొన్న దరఖాస్తు ఆధారంగా కూడా సరిచూసుకోవచ్చును.


👉 ఉద్యోగికి సంబంధించిన సర్వీసు వివరములు కొంతకాలం మేరకు తెలుసుకొనుటకు అవకాశం లేని పక్షమున,శాఖాధిపతి ఉద్యోగి అట్టి కాలములో సర్వీసులో ఉన్నాడని, సస్పెన్షన్ లో లేడని, అదేవిధంగా Extra Ordinary Leave లో లేడని ఒక సర్టిఫికేట్ జారీచేయవచ్చు.

    కానీ అట్టి సర్టిఫికెట్ సాక్ష్యాధారములతో కూడిన వాటి మూలంశాల ఆధారితంగా ఉండవలెను.

Share on:


💥మీ మొబైల్ లో 10 నిమిషాల్లో గ్రాడ్యుయేట్ MLC ఓటరుగా నమోదు అయ్యే విధానం.....💥


_*👇👇ఫోన్ ద్వారా ఈ క్రింది విధంగా గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా 10 నిమిషాల్లో నమోదు కావొచ్చు.*_


_*Graduate Voter online enrollment link*_


https://ceotserms1.telangana.gov.in/MLC/form18.aspx


_*మీరు... పై లింక్ ను క్లిక్ చేసి గ్రాడ్యుయేట్ MLC ఓటర్ గా నమోదు కావొచ్చు..*_

_*1.మొదట మీ పేరు వ్రాయాలి.*_

_*2.మీ సర్ నేమ్ వ్రాయాలి*_ 

_*3.తండ్రి/భర్త పేరు(రేలేటివ్ నేమ్ అని ఉంటుంది)*_

_*4.వారి సర్ నేమ్ వ్రాయాలి*_

_*5.పక్కన టైప్ ఆఫ్ రిలేషన్ (తండ్రి/భర్త/... అని వ్రాయాలి)*_

_*6.జెండర్*_

_*7.డేట్ ఆఫ్ బర్త్*_

_*8.విద్యార్హతలు*_

_*9.వృత్తి*_

_*అడ్రెస్ డీటెయిల్స్*_

_*10.ఇంటి నెంబర్*_

_*11.గ్రామం/టౌన్*_

_*12.పోస్ట్ ఆఫీస్*_

_*13.మండలం*_

_*14.వీధి*_

_*15.పిన్ కోడ్*_

_*అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు*_

_*16.జిల్లా*_

_*17.అసెంబ్లీ నియోజకవర్గం*_

_*18.ఎపిక్ కార్డు నెంబర్.*_

_*19.క్రమ సంఖ్య*_

_*20.పోలింగ్ స్టేషన్ నెంబర్*_

_*21.గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమో ను క్లిక్ చేయాలి*_

_*22.యూనివర్సిటీ పేరు*_

_*23.పాసయిన తేదీ*_


_*డాకుమెంట్స్ అప్లోడ్ చేయాలి...*_


_*పాస్ ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్ లను ముందుగా ఫోన్ లో ఫోటో తీసి గ్యాలరీ లో సేవ్ చేసుకున్న అనంతరం ఈ క్రింది లింక్ ద్వారా Image Size Reducer App ను ఇన్స్టాల్ చేసుకొని ఈ ఆప్ ఓపెన్ చేసి Load ఆప్షన్ నొక్కి Inbuilt Gallery నుండి ఫోటో ను సెలెక్ట్ చేసుకొని Custom KB ఆప్షన్ క్లిక్ చేసి  పాస్ ఫోటో  అయితే size 90 kb టైప్ చేయాలి , డిగ్రీ సర్టిఫికెట్  ఫోటో  అయితే size 190 Kb టైప్ చేసి OK బటన్ నొక్కితే Image Size Reduce అయి Save to Gallery ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే Gallery లో  Image Size Reducer App Album లో  Size Reduce అయిన Image కనిపిస్తుంది. ఈ విధముగా ముందుగా  పాస్ ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్ లను Size Reduce చేసి ఉంచుకొని ఆ తర్వాత Form 18 లింక్ క్లిక్  చేసి అన్ని ఆప్షన్ లను ఫిల్ అప్ చేసిన తరువాత  Size Reduce చేసిన Images ను  సెలెక్ట్ చేసుకొని Upload చేయాలి.*_


https://play.google.com/store/apps/details?id=org.greh.imagesizereducer


_*24.అప్లోడ్ చేసే క్రమంలో  మొదట పాస్ ఫోటోను*_ 

_*25.ఆ తరువాత సర్టిఫికెట్ ను అప్లోడ్ చేయాలి.*_

_*26.మన ఓటు ఇతర నియోజకవర్గం లో  ఉంటే తీసి వేయమని కోరాలి.*_

_*27.ఫోన్ నెంబర్ వ్రాయాలి.*_

_*28.ఇ మెయిల్ ఐడి వ్రాయాలి.*_

_*29.ఐదు అంకెల కోడ్ ఎంటర్ చేయాలి*_

_*30.సబ్ మిట్ చేయాలి.*_

_*31.అక్నాలెడ్జి మెంట్ ను స్క్రీన్ షాట్ తీసుకోవాలి...*

🙏🙏 మీ మిత్రులకు షేర్ చేయండి 🙏🙏

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



Share on:


2020 సివిల్స్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ 

      


ఈరోజు జరిగినటువంటి సివిల్స్ ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్ Gs 1 & Gs2 pdf link కింద ఇచ్చాను చూడండి


పిడిఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👇👇👇

            General studies paper 1

            General studies paper 2 PDF

Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates