గుడ్ న్యూస్.. 13,155 బ్యాంక్ జాబ్స్
దేేశవ్యాప్తంగా ఉన్న 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9638 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ రీఓపెన్ చేస్తూ ఐబీపీఎస్ కొత్తగా అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 4500 లకు పైగా ఆఫీస్ అసిస్టెంట్, 3800 స్కేల్-I ఆఫీసర్, వెయ్యికి పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలున్నాయి. మన రాష్ర్టంలో 470, ఏపీలో 320 జాబ్లున్నాయి. అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత; అసిస్టెంట్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్‌కు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. స్పెషలిస్ట్ పోస్టులకు జాబ్‌ను బట్టి అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ర్టీ, ఎనిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీలో డిగ్రీ పాసైన వారు అర్హులు. మల్టీపర్పస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కానీ మిగిలిన పోస్టులకు ఒకటి నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.ప్రాంతీయ భాషపై అవగాహనతో పాటు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ తప్పనిసరి.
వయసు: 2020 నవంబర్9 నాటికి ఆఫీస్ అసిస్టెంట్‌కు 18 నుంచి 28, స్కేల్–I ఆఫీసర్‌కు 18 – 30, స్కేల్–II కి 21–32, స్కేల్–III కి 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, పీడబ్ల్యూడీలకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ.175
అప్లికేషన్ ప్రాసెస్: 26 అక్టోబర్ 2020 నుంచి ఆన్లైన్లో..; చివరితేది: 9 నవంబర్ 2020;
వెబ్సైట్; CLICK HERE
ప్రిలిమినరీ ఎగ్జామ్: ఆఫీసర్ స్కేల్–I(31 డిసెంబర్ 2020), ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు 2021 జనవరి 2,4 తేదీల్లో..
ఖాళీలు
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టి పర్పస్) 4624
ఆఫీసర్(అసిస్టెంట్ మేనేజర్) 3800
అగ్రికల్చర్ ఆఫీసర్ 100
మార్కెటింగ్ ఆఫీసర్ 8
ట్రెజరీ మేనేజర్ 3
లా ఆఫీసర్ 26
చార్టెడ్ అకౌంటెంట్ 26
Y
ఐటీ ఆఫీసర్ 58
జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ 837
ఆఫీసర్ స్కేల్– III 156
మొత్తం 9638
ఇన్స్టిట్యూట్ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) ఇప్పటికే1167 పీవో, మేనేజ్మెంట్ట్రెయినీ పోస్టులకు కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ లో నోటిఫికేషన్ రిలీజ్చేసింది.. నియామక ప్రక్రియ కొనసాగుతుండగా.. దీనికి అనుబంధంగా కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 3,517 ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైయినీ పోస్టులు భర్తీకి అక్టోబర్ 28 నుంచి అప్లికేషన్స్ మళ్లీ స్టార్ట్ అయ్యాయి.
బ్యాంకు–ఖాళీలు
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 2020 నవంబర్11 నాటికి 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు ఐదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో..
అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్: 28 అక్టోబర్ 2020
చివరి తేదీ: 11 నవంబర్ 2020
ప్రిలిమినరీ ఎగ్జామ్: 2021 జనవరి 5 లేదా 6
కాల్ లెటర్; పరీక్షకు 10 రోజుల ముందు
వెబ్సైట్: CLICK HERE
నోట్: 2020 ఆగస్టు 5 నుంచి 26 వరకు అప్లై చేసినవాళ్లు, అక్టోబర్ 3, 10, 11 తేదీల్లో జరిగిన ఐబీపీఎస్ పీవో ప్రిలిమ్స్2020 పరీక్షకు హాజరైన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. 2020 నవంబర్ 11 నాటికి విద్యార్హతలు సాధించినవారు, 2020 ఆగస్ట్ 5 నాటికి రిజిస్టర్ చేసుకోలేనివారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలెక్షన్ ప్రాసెస్; ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో సెలెక్షన్ ఉంటుంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్; ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో మొత్తం మూడు సెక్షన్లుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ లో 35 ప్రశ్నలకు గాను 35 మార్కులు కేటాయించారు. అన్ని సెక్షన్లలో కలిపి మొత్తం 100 మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి సెక్షన్‌కు 20 నిమిషాల సమయం ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ 60 నిమిషాలు. ప్రిలిమినరీలో కేటగిరీల వారీగా సెక్షనల్ కటాఫ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ కండక్ట్ చేస్తారు.
మెయిన్స్ ఎగ్జామ్; దీనిలో మొత్తం ఐదు సెక్షన్లుంటాయి. రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 ప్రశ్నలకు గాను 60 మార్కులు కేటాయించారు. జనరల్/ఎకానమి/బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలకు 40 మార్కులు, ఇంగ్లిష్ నుంచి 35 ప్రశ్నలకు 40 మార్కులు, డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రెటేషన్ నుంచి 35 ప్రశ్నలకు 60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్(లెటర్ రైటింగ్ & ఎస్సే) నుంచి 2 ప్రశ్నలకు గాను 25 మార్కులుంటాయి. మొత్తం మార్కులు 225.
ఇంటర్వ్యూ; మెయిన్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. దీనికి 100 మార్కులు. మెయిన్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్
కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో భాగంగా 2021–22 ఇయర్‌కు గాను స్పెషలిస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్కు ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది.ఖాళీలపై అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ వెల్లడించాల్సి ఉంది; పోస్టులు: ఐటీ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ; దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో; అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం: 2 నవంబర్ 2020 ;
చివరి తేది: 23 నవంబర్ 2020 ;
ప్రిలిమ్స్ : 2020 డిసెంబర్ 26, 27 తేదీల్లో.