తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభం
ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో మంత్రులు కలెక్టర్ తో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఈ క్రింది కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
1). ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలు 9 ఆపై తరగతులు అంటే కళాశాలలు కూడా తెరవాలని ఆదేశించడం జరిగింది.
2). కొవిడ్ కారణంగా దాదాపు 10 నెలలుగా మూతపడ్డ టువంటి పాఠశాలలు కళాశాలల్లో ఫిబ్రవరి 1 నుంచి తెరుస్తూ నిబంధనలు పాటిస్తూ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది.
3).రెవెన్యూకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
4). ధరణికోట లో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు వారం రోజుల్లోగా చేయాలని అధికారులను ఆదేశించారు.
5). కరుణ వ్యాక్సినేషన్ కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లు వెంటనే పూర్తిచేయాలని దాంతోపాటు అడవుల పునరుద్ధరణ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరారు.
6).అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు వెంటనే జరపాలని దాంతోపాటు ఖాళీలను అన్ని గుర్తించి వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
7).అన్ని పట్టణాలు గ్రామాల్లో వైకుంఠ గ్రామాలు అదేవిధంగా సమీకృత మార్కెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.