కూతుర్లు వుంటే శుభవార్త ఏంటి? అని ఆలోచిస్తున్నారా?అవును అండీ.. కూతుర్లు వుంటే మీకో శుభవార్త అంటోంది కేంద్రప్రభుత్వం.
ఆడ పిల్లలు ఉన్నవార ఉన్నవారు తమ బిడ్డల కోసం డబ్బులు దాచిపెట్టాలని అనుకుంటుంటారు.
ఇలాంటి వారి కోసం కేంద్రం ఒక మంచి పథకాన్ని ప్రకటించింది.
అయితే వీరి కోసం బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో కొత్త పథకాన్ని ను ప్రవేశపెట్టింది కేంద్రం.
అదే సుకన్య సమృద్ధి యోజన పథకం. ఈ పథకం మీకు, ఇద్దరు కూతుర్లు వరకు వర్తిస్తుంది.
ఈ పథకం కోసం మీరు మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుకు కానీ, పోస్ట్ ఆఫీస్ కి కానీ వెళ్లి, అక్కడ సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి అడగండి.
వారు ఏ విధంగా చేయాలో మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా చెబుతారు. మీరు బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి మీ అమ్మాయి పేరు పైన ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
ఆ అమ్మాయి పేరు మీద ప్రతి నెల అకౌంట్లో కేవలం 1000/- రూపాయలు జమ చేస్తే చాలు.
అయితే ఇలా చేయాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. ఇందుకోసం పాప యొక్క వయస్సు 10 years లోపై ఉండాలి.
ఇలా మీ కూతురు అకౌంట్ కి ప్రతినెలా 1000/- రూ,, లు జమ చేస్తూ వెళ్లండి.
ఈ పథకం ఏ రోజైతే మీ అమ్మాయి పేరు మీద మొదలుపెడతారో ఆ రోజు నుంచి సరిగ్గా 14సం,, లు సంవత్సరాలు ప్రతి నెలా జమ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ పాపకు 21 సం,, లు వచ్చేసరికి ఈ పథకం పూర్తవుతుంది. అయితే ఇందులో గరిష్టంగా నెలకి కి రూ.12,500 రూపాయలు లేదా సం,, కి 150,000/- జమ చేసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.
సుకన్య సమృద్ధి యోజన స్కీం మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరాలు.
21 సంవత్సరాలు ముగిసిన తర్వాత మీ డబ్బు మీరు తీసుకోవచ్చు.
18 సంవత్సరాలకే కొంత డబ్బును తీసుకునే వెసులు బాటను కేంద్రం కల్పించింది. కానీ మీరు మొత్తం డబ్బులు తీసుకోవాలంటే మాత్రం మీ పాపకు 21 సంవత్సరాలు వచ్చే వరకు ఆగాల్సిందే.
అంతేకాకుండా ప్రస్తుతం సుకన్య సమృద్ధి స్కీం పై 7.6% వడ్డీని కూడా అదనంగా కల్పిస్తోంది.
మీరు ఈ పథకంలో ప్రతినెలా వెయ్యి రూపాయలు జమ చేస్తూ వెళ్తే మీకు గరిష్ఠంగా రూ.5.27 లక్షల రూపాయలు మీ చేతికి వస్తాయి.
అయితే ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి అడగండి.
For more details 👇👇👇👇👇👇👇👇👇
Click here