భారతదేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్టీపీసీ), ఏటా దీని ఉత్పత్తి సామర్థ్యం 64,880 మెగావాట్లు, 2032 నాటికి 130 గెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరు కోవాలనేది ఈ సంస్థ ప్రధాన లక్ష్యం , తాజాగా న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ కేంద్ర కార్యాలయం వివిధ విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది
అసిస్టెంట్ ఇంజనీర్: 200
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ స్టుమెంటేషన్
• అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎస్పీ, ఎస్టీ, పీడ బ్ల్యూడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే చాలు
అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ తరవాత ట్రెయి నింగ్ పిరియడ్ కాకుండా ఏడాది పని అనుభవం ఉండాలి
వయసు: 30 ఏళ్లకు మించకూడదు
వేతన స్కేలు: రూ.30,000 నుంచి 1,20,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా
మాత్రమే ఎంపిక చేస్తారు. రాత పరీక్ష సబ్జెక్టు నాలెడ్జ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ అని రెండు విభాగాల్లో ఉంటుంది. అభ్యర్థులు రెండు విభాగాల్లోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు: జనరల్/ ఈబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ
అసిస్టెంట్ కెమిస్ట్: 30
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే చాలు
అనుభవం: పోస్ట్ క్వాలిఫికేషన్ తరవాత ట్రెయినింగ్ పిరియడ్ కాకుండా సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. పవర్ ప్లాంట్లో పనిచేసిన అనుభవం ఉన్న
వారికి ప్రాధాన్యం ఇస్తారు వయసు: 30 ఏళ్లకు మించకూడదు
వేతన స్కేలు: రూ.30,000 నుంచి 120000
వరకు చెల్లిస్తారు.
అభ్యర్థులు రూ.300 ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీబ్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 24;
ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 10