AP,TS TET TRT previous bits on Telugu method
1.అక్షరాలలో ఒకే పోలిక కలిగిన అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి ఒక్కొక్క వర్గాన్ని ఒక యూనిట్ గా నేర్పే బోధన పద్దతి?
a.అక్షర పద్ధతి
b.పద పద్ధతి
c.నవీనాక్షర పద్దతి
d.వాక్య పద్దతి
1.c
2.భాష సామర్థ్యాలలో చాలా కీలకమైన భాష నైపుణ్యాలు?
a.శ్రవణం
b.భాషణం
c.పఠనం
d.లేఖనం
1.a,b
2.b,c
3.c,a
4.a,b,c,d
2.1
3.పఠనం ఏ భాష నైపుణ్యాలకు వారధిగా ఉంటుంది?
a.భాషణం, లేఖనం
b.భాషణం, శ్రవణం
c.శ్రవణం, లేఖనం
d.భాషణం, లేఖనం, శ్రవణం
3.a
4.విద్యార్థుల్లో భాషణ శక్తి, సృజనాత్మకశక్తి దేని ద్వారా పెంపొందుతాయి?
a.ప్రశ్నించడం
b.చర్చించడం
c.వర్ణించడం
d.పైవన్నీ
4.c
5. జాయ్ ఫుల్ లెర్నింగ్
(ఆనందదాయకంగా బోధన)కు దారితీసే భాషా నైపుణ్యం?
a.భాషణం
b.పఠనం
c.లేఖనం
d.శ్రవణం
5.d
6.కనీస అభ్యసన సామర్ధ్యాలు ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయుడు తన పాఠ్య బోధనను ఎన్ని సామర్ధ్యాలపై దృష్టి కేంద్రీకరించాలి?
a.9
b.8
c.7
d.6
6.a
7.ఏ భాష నైపుణ్యం ద్వారా పిల్లలు తమ భావాలను నిర్దిష్టంగా చెప్పగల్గడం,తనకు కలిగిన అనుభవాలను,ఆలోచనలను సొంతమాటల్లో వ్యక్తీకరించగలుగుతారు?
a.శ్రవణం
b.భాషణం
c.పఠనం
d లేఖనం
7.b
8.భారతదేశంలో "సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం" ప్రారంభించిన సంవత్సరం?
a.1990-91
b.1991-92
c.1992-93
d.1993-94
8.a
9.కనీస అభ్యసన సామర్థ్యాలు ప్రవేశపెట్టడంలోని లక్ష్యాలు?
1.విద్యలో నాణ్యత
2.సమానత్వం
3.ఉపాధ్యాయుల జవాబుదారితనం
4.విద్యార్థుల జవాబుదారితనం
a.1,2,4
b.1,3,4
c.1,2,3
d.1,2,3,4
9.c
10."ఫ్లాష్ కార్డు / గుర్తింపు కార్డు"ను ఉపయోగించి బోధించే పద్ధతి?
a.అక్షర పద్ధతి
b.పద పద్ధతి
c.నవీనాక్షర పద్ధతి
d.వాక్య పద్ధతి
10.b
11.క్రింది వాటిలో భాష నైపుణ్యాలకు సామాన్య స్పష్టీకరణలు?
1.స్పష్టత
2.నిర్దిష్టత
3.సమత
4.అందం
5.వేగం
a.1,2,3
b.1,2,4
c.1,2,3,5
d.1,2,3,4,5
11.d
12.విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని తప్పక పెంపొందించే కృత్యం?
a.కవితా రచన
2.కథా రచన
3.వర్ణనాత్మక రచన
4.పాఠశాల పత్రిక
12.d
13."విరామ సమయాన్ని సద్వినియోగపర్చుకోవడం" అనేది ఏ భాషా నైపుణ్య లక్ష్యం?
a.శ్రవణం
b.భాషణం
c.పఠనం
d.లేఖనం
13.c
14.శాస్త్రీయ పద్ధతిలో ఎన్ని సోపానాల ద్వారా "భాషా సామర్థ్యాల అభివృద్ధి" సాధించవచ్చని భాషా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు?
a.4
b.5
c.7
d.9
14.c
15.పిల్లవాడికి ఎన్ని సంవత్సరాలు వచ్చేసరికి ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఉన్న పదాలను పలకగల్గుతాడు?
a.2
b.3
c.4
d.5
15.b
16. విద్యార్థులకు పాఠ్యాంశాలపై ఆసక్తిని కలిగించి పఠన నైపుణ్యం,భాషా నైపుణ్యాలు పెంపొందేటట్లు సహకరించేవి?
a.శిశు గేయాలు
b.భాషా క్రీడలు
c.అభినయ గేయాలు
d.కథాకథనం
16.c
17.తరగతి గదిలో "శ్రవణ భాషణాలను" నిర్వహించడానికి ప్రత్యేకంగా ఎన్ని పిరియడ్లు కేటాయించుకుని కృత్యం నిర్వహించాలి?
a.1
b.2
c.3
d. ప్రత్యేక పీరియడ్ అవసరం లేదు
17.a
18.విద్యార్థులలో (ప్రాథమిక దశ) భయం,సిగ్గు తొలగించడానికి భాషాభివృద్ధికి తోడ్పడేవి?
a.చర్చలు
b.భాషా క్రీడలు
c.అభినయ గేయాలు
d.నాటికలు
e.కథా కథనం
1.a,b,e
2.b,c,d
3 b,c,e
4.a,b,d,e
18.3
19.విద్యార్థుల "వాగ్దోషాలను తెలిసికొని నివారించుటకు మరియు నిర్దిష్ట వాచిక చర్యలను సాధించుటకు" ఉపయోగపడే పఠనం?
a.మౌన పఠనం
b.ప్రకాశ పఠనం
c.విస్తార పఠనం
d.క్షుణ్ణ పఠనం
19.b
20.విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొని ఉపాధ్యాయుని అనుసరిస్తూ చేసే పఠనం?
a.ఆదర్శ పఠనం
b.మౌన పఠనం
c.క్షుణ్ణ పఠనం
d.అనుగుణ పఠనం
20.d
21.నిరంతర సమగ్ర మూల్యాంకనంలో "పిల్లల ప్రగతి" గురించి అంచనా వేసేది?
a.మూల్యాంకనం
b.నివేదిక
c నిర్మాణాత్మక మూల్యాంకనం
d.సంగ్రహణాత్మక మూల్యాంకనం
21.a
22.విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి పరిచి,శ్రవణ సామర్థ్యాన్ని,ఉచ్చారణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే శ్రవ్య బోధనాభ్యాసన ఉపకరణం?
a.టేపు రికార్డర్
b.రేడియో
c.దూరదర్శిని
d.సిడి/డివిడి ప్లేయర్
22.a
23.సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా "గేయం,కథ,సంభాషణ" మూడింటిలో ఏదో ఒకటి రాయండి. అనే ప్రశ్న ద్వారా విద్యార్థుల్లో అంచనా వేసే సామర్థ్యం?
a.స్వీయ రచన
b.భాష గురించి తెలుసుకుందాం
c.ప్రాజెక్టు పని
d సృజనాత్మకత
23.d
24.విద్యార్థుల్లో చదవడం - అర్థం చేసుకొని చెప్పడం మరియు స్వీయరచన వంటి సామర్థ్యాలు అభివృద్ధి పరచడానికి ఉపయోగపడే దృశ్య బోధనాభ్యసన ఉపకరణం?
a.చిత్రాలు
b.చార్టులు
c.గోడ పత్రిక
d.నమూనాలు/ బొమ్మలు
24.a
25.ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ప్రతిరోజు తెలుగు బోధించడానికి కేటాయించిన సమయం?
a.45 నిమిషాలు
b.60 నిమిషాలు
c.90 నిమిషాలు
d.120 నిమిషాలు
25.c
26.నెలవారీగా నిర్వహించవలసిన విద్యాసంబంధ కార్యక్రమాలను, అకాడమిక్ క్యాలెండర్ ను అనుసరించి సిద్ధం చేసుకోనే ప్రణాళిక?
a.పిరియడ్ ప్రణాళిక
b.యూనిట్ ప్రణాళిక
c.వార్షిక ప్రణాళిక
d.సంస్థాగత ప్రణాళిక
26.d
27. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి?
1. భాష సృజనాత్మకతకు సహాయకారి
2. సృజనాత్మకత భాషకి సహాయకారి
3. భాష వికాసానికి దోహదకారి
4. వికాసం భాషకి దోహదకారి
5. ఆలోచనలకు, భాషకు విడదీయరాని సంబంధం ఉంది
6. ఆలోచనలకు భాషకు విడదీయరాని సంబంధం లేదు
a.1,3,6
b.2,3,5
c.1,3,5
d.2,4,6
27.c
28."ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి తొందరగా, తేలిగ్గా శాశ్వతమైన విషయ అవగాహనకు ఉపయోగపడుతుంది" అని చెప్పిన ప్రముఖ విద్యావేత్త?
a.పీవీ నరసింహారావు
b.అబ్దుల్ కలాం
c.నెహ్రూ
d.హుమాయున్ కబీర్
28.d
29.ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంలో గమ్యాన్ని చేరడానికి వరుసక్రమంలో నిర్ణయాల ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియ "ప్రణాళిక" అని పేర్కొన్నది?
a.Y.డోర్
b. సైమన్ పాటర్
c.లియోనార్డ్ బ్లూమ్ ఫీల్డ్
d.హాకెట్
29.a
30."పిల్లలు భయంతో చదువుకునేలా ప్రేరేపించడం మూల్యాంకనం లక్ష్యం కాదు" అని పేర్కొన్నది?
a.జాతీయ విద్యా ప్రణాళిక చట్టం-1968
b. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం-1986
c.N.C.F.-2005
d.R.T.E.-2009
30.c