PSK education

AN EDUCATIONAL WEBSITE

Powered by Blogger.
  • October 20231
  • September 202310
  • June 20231
  • July 20221
  • November 20212
  • August 20214
  • July 202115
  • June 202154
  • May 202169
  • April 202121
  • March 202113
  • February 202139
  • January 202160
  • December 202061
  • November 202058
  • October 202064
  • September 202022
  • August 202029
  • July 202031
  • June 20209

Translate

CATEGORY >

      💥పత్రికా ప్రకటన💥 

Bus Timetable in lockdown from kollapur to various places

      👉 రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కి గాను లాక్ డౌన్ విధిస్తూ ఉదయం 6.00 గంటల నుంచి 10.00గంటలవరకు ఆర్.టి.సి.బస్ లకు అనుమతి ఇచ్చింది.

👉అందుకు అనుగుణంగా కొల్లాపూర్ నుంచి వివిధ ప్రాంతాలకు బస్ లను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వరప్రసాద్ గౌడ్ గారు తెలిపారు. 


కొల్లాపూర్ నుంచి హైద్రాబాద్ వైపు

3.00, 3.30,4.00, 4.30,

6.00, 6.30

హైద్రాబాద్ నుంచి కొల్లాపూర్ వైపు

6.00, 6.30, 7.00

7.30, 8.00, 830


కొల్లాపూర్ నుంచి         నాగ ర్ కర్నూలు వైపు

6.00, 6.30 , 7.00

7.30,. 8.00, 8.30

నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్ వైపు

6.00, 6.30, 7.00

7.30, 8.00, 8.30


కొల్లాపూర్ నుంచి కేతేపల్లి వనపర్తి వైపు

5.30, 6.00, 6.30, 

7.00, 7.30, 9.00

వనపర్తి నుంచి కేతేపల్లి కొల్లాపూర్ వైపు

6.00, 7.00, 7.30,

8.00, 8.30, 9.00


కొల్లాపూర్ నుంచి పెబ్బేరు

5.30, 6.00, 6.30

7.00, 7.40, 9.00

పెబ్బేరు నుంచి కొల్లాపూర్

6.00, 7.10, 7.40,

8.10, 8.40,9.20 

బస్ లు బయలు దేరును.

  కావున ప్రయాణికులు తగిన మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఆర్.టి.సి. బస్ లలో నిర్భయంగా ప్రయాణించాల్సినది గా డిపో మేనేజర్ వర ప్రసాద్ గౌడ్ గారు తెలిపారు.


                  ఇట్లు

        డిపో మేనేజర్

              కొల్లాపూర్.

Share on:


PM Kisan Samman Nidhi 8th phase amount release update

 :-ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి:-

         

👉పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ప్రభుత్వ ప్రజాదరణ పొందిన పథకాల్లో ఒకటి. 

👉ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ .6 వేలు అందిస్తుంది.

👉ఈ డబ్బును నేరుగా రైతుల ఖాతాకు పంపుతారు. 

👉ప్రతి నాలుగు నెలలకోసారి ఈ రూ.2వేలను రైతుల అకౌంట్లో జమ చేస్తోంది.


_👉త్వరలో 8వ విడత డబ్బులు విడుదల చేయనున్నారు.


👉PM Kisan Beneficiary Status_Click here 


👉PM Kisan  Beneficiaries List_

      Click here 



👉PM Kisan Androip app

_Click here 



👉PM Kisan Help Desk Detailes Click here


Share on:

 ISRO Internet Training for Teachers 

        

♦️ఉపాధ్యాయులకు ఇస్రో అంతర్జాల శిక్షణ♦️


అంతరిక్ష సాంకేతికతపై తరగతులు


👉కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో ఉపాధ్యాయులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 

👉ఈ ఖాళీ సమయంలో ఉపాధ్యాయులు తమ పరిజ్ఞానాన్ని పెంపొం దించుకోవడానికి, అంతరిక్షంపై అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉచితంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తోంది. 

👉ఇందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

👉ఇస్రో పరిధిలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (ఐఐఆర్‌ఎస్‌) వారు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కోర్సును సిద్ధం చేయగా తరగతుల నిర్వహణకు ఈ నెల 5 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమవగా 30వ తేది వరకు అవకాశం ఉంది.


♦️ఈ1 నెల 31 నుంచి తరగతులు ♦️

👉2007 నుంచి ఇస్రో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ కోర్సులు ఇప్పటి వరకు 76 పర్యాయాలు నిర్వహించారు.

 👉ఇందులో దేశ వ్యాప్తంగా 3.05 లక్షల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

👉ఈ సారి కూడా విజయ వంతంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టింది. 

👉ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు అంతర్జాలంలో https://www.iirs.gov.in/ EDUSAT-news లింక్‌ ద్వారా చరవాణి, జీమెయిల్‌, పేరు తదితర వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్ఛు నమోదు చేసుకున్న వారికి ఈ నెల 31 నుంచి వచ్చే 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 

👉ఇందులో 70 శాతం హాజరు నమోదు ఉంటూ ప్రతిభ చాటిన ఉపాధ్యాయులకు ఇస్రో మెయిల్‌ ద్వారా ధ్రువపత్రం అందించనున్నారు. 

👉అంతరిక్ష సాంకేతికత పరిజ్ఞానం, వాటి అనువర్తనాలు అనే అంశంపై తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వనున్నారు. 

👉ఆర్థిక, సామాజిక అభివృద్ధి, వాతావరణ సమాచారం, దూరవిద్య, పర్యావరణం, శీతోష్ణస్థితిపై అధ్యయనం, ఆహారం, నీటి భద్రత, ప్రకృతి వైపరీత్యాలు అనే ఉప అంశాలపై పూర్తిగా అవగాహన కల్పించేలా తరగతులు ఉంటాయి.*

🔷  ISRO Internet Training for Teachers 🔷


Classes on space technology 


👉Schools closed in the wake of the Corona boom. 

👉As a result, all the teachers were confined to their homes. 

👉During this free time, the Indian Space Research Organization (ISRO) is conducting free online classes for teachers to enhance their knowledge and allay doubts about space. 

👉Applications are invited from those who are interested. 

👉The Indian Institute of Remote Sensing (IIRS) under ISRO has prepared a special course for teachers to conduct classes from the 5th of this month till the 30th of the enrollment process. 


 Classes from 31st of this month: 

👉Online courses conducted by ISRO since 2007 have been conducted 76 times till date.

 👉It was attended by 3.05 lakh teachers across the country.

 👉This time too it has taken all sorts of steps to successfully conduct online classes. 

👉Interested teachers can register online at https://www.iirs.gov.in/ EDUSAT-news with the details of mobile, Gmail, name etc. from 31st to 4th of this month. 

👉Talented teachers with 70 per cent attendance will be given a certificate by ISRO mail. Classes will be conducted and trained on space technology and their applications. 

👉Classes are designed to provide a thorough understanding of sub-topics such as economic and social development, meteorological information, distance education, environment, climate studies, food, water security, and natural disasters. 

Share on:

 Oxyzen story in the world


భూమ్మీద సమస్త ప్రాణి కోటి ఆక్సిజన్. ఆక్సిజన్, ఆక్సిజన్. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట.

 మనుషులే కాదు.. మనుగడకు ఇదే ఆధారం.

 రోజువారీ వ్యవహారాల్లో దీన్ని ఎన్నడూ తలచుకొని ఎరగం గానీ కొవిడ్-19 పుణ్యమాని ఇప్పుడు అందరి ఆలోచనలూ దీని చుట్టే తిరుగుతున్నాయి. 


💥ఏంటీ దీని కథ?💥


ఎలా ఉత్పత్తి చేస్తారు?


👉ఆక్సిజన్‌ను 1772లో స్వీడన్ శాస్త్రవేత్త కార్ల్ విల్ హెల్మ్ షీలే తొలిసారి కనుగొన్నారు. మరో ఆంగ్ల శాస్త్రవేత్త జోసెఫ్ ప్రీస్ట్రీ కూడా 1774లో దీన్ని గుర్తించారు

. 👉ద్రవ గాలిని ఆవిరి రూపంలోకి మార్చటం ద్వారా ఆక్సిజన్ ను పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో నైట్రోజన్ ఆవిరి రూపంలో వేరై.. ద్రవరూపంలోని ఆక్సిజన్ మిగిలిపోతుంది. 


👉స్వచ్ఛమైన, పొడి గాలిని హైడ్రోజన్ అణువుల జాళ్ల ద్వారా ప్రసరింపజేసీ ఆక్సిజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంటారు. విద్యుత్తు సాయంతో నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్ గా విడగొట్టటం ద్వారానూ ఆక్సిజన్‌ను తయారు చేస్తారు.


💥రకరకాలుగా వినియోగం »💥

ఒక్క వైద్యపరంగానే కాదు.. పరిశ్రమల్లోనూ ఆక్సిజనను విరివిగా వాడుతుంటారు. 


👉స్టీలు తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. వాణిజ్యపరంగా ఉత్పత్తయ్యే ఆక్సిజన్లో 55% దీనికే ఉపయోగిస్తుంటారు. ఎథిలీన్ ఆక్సైడ్, ఆక్రిలిక్ యాసిడ్, డైఫార్మైల్-ఫురేన్, బెంజైలిక్ యాసిడ్ వంటి రసాయనాల తయారీకీ ఇది అవసరమే. 

👉లోహాలను కోయటానికి, వెల్డింగుకూ ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. రాకెట్ ఇంధనంలో ఆక్సిడైజర్‌గానూ, నీటిని శుద్ధి చేయటానికి దీన్ని వాడుకుంటారు.


 👉మన వాతావరణంలోని గాలి ప్రత్యేకతే వేరు. ఇందులో 21% ఆక్సిజన్ ఉంటుంది

👉మనకు తెలిసినంతవరకు విశ్వంలో మరెక్కడి వాతావరణంలోనూ ఇంత ఎక్కువ స్థాయిలో ప్రాణవాయువు లేదు.

 👉ఒక్క మాటలో చెప్పాలంటే ఆక్సిజన్ ను భూమి సంతకమనీ అనుకోవచ్చు. 

👉ఇంతకీ మన భూమ్మీద ఆక్సిజన్ ఎలా పుట్టుకొచ్చింది? ఇంత ఎక్కువస్థాయిలో ఎలా ఉంటోంది? ఇంతటి కీలకమైన ఆక్సిజన్ స్థాయులు ఎలా స్థిరంగా ఉంటున్నాయి? అన్నీ ఆలోచించదగ్గ, ఆశ్చర్యకరమైన ప్రశ్నలే. 

👉భూమి, ఖండాలు, మహా సముద్రాలు ఏర్పడిన తర్వాత మన వాతావరణం క్రమంగా ఆక్సిజన్ లేమి స్థితి నుంచి ఆక్సిజన్ సహిత స్థితికి చేరుకుంది. 

👉వాతావరణంలో ఇంత పెద్దమొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి కావటానికి మూలం కిరణజన్య సంయోగ క్రియ. 

👉మూడొంతుల ఆక్సిజన్ ఇలా చెట్లు, మొక్కల ఆకులే కాదు.. 

👉సైయానోబ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములూ ఇందులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. 

👉ఆశ్చర్యంగా అనిపించినా ఆక్సిజన్ అనేది కిరణజన్య సంయోగక్రియలో భాగంగా పుట్టుకొచ్చే ఓ వ్యర్థ పదార్ధం! 

👉సూర్యరశ్మి ప్రసరించినప్పుడు వీటిల్లోని పత్ర హరితం సూర్యరశ్మిని పట్టేసుకొని దాన్ని పిండి పదార్థంగా మార్చేస్తుంది. 

👉ఈ పక్రియలో భాగంగా నీటి అణువులు విడిపోయి ఆక్సిజన్ పుట్టుకొస్తుంది. 

👉ఇదే ప్రాణుల మనుగడకు బీజం వేసింది. చాలామంది నిపుణుల అంచనా మేరకు 50 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి భూమ్మీద జీవం ఆరంభమైంది. 

👉450 కోట్ల సంవత్సరాల క్రితం వరకు సజీవ కణాలు.. ఆ మాటకొస్తే బ్యాక్టీరియా కూడా ఉనికిలో లేవు.

👉 తదనంతర కాలంలో బ్యాక్టీరియా, ఇతర కణాలు వృద్ధి చెందుతూ వచ్చాయి. ఆక్సిజన్ రహిత స్థితిలోనే జీవక్రియలు కొనసాగించాయి. 

👉కిరణజన్య సంయోగక్రియ ఆరంభమైన తర్వాతే వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరగటం మొదలైంది. పెద్ద ప్రాణుల పుట్టుకకు.. పరిణామక్రమంలో జీవుల మనుగడకు మార్గం సుగమం చేసింది ఇదే.


💥శక్తి మూలం! »💥

👉ఆక్సీస్, జీన్స్ అనే గ్రీకు పదాల కలయికతో ఆక్సిజన్ పేరు పుట్టుకొచ్చింది. ఆక్సీస్ అంటే పదునైన, జీన్స్ అంటే తండ్రి అని అర్థం. 

👉మొదటి పదం ఏమో గానీ రెండో పదం మాత్రం నిజంగానే అర్థవంతంగా నిలిచింది. భూమ్మీద జీవం మనుగడలో ఆక్సిజన్దే కీలకపాత్ర మరి. మనుషుల ద్రవ్యరాశిలో మూడింట రెండో వంతు ఆక్రమించేదీ ఇదే - ఆక్సిజన్, హైడ్రోజన్‌తోనే కదా నీరు ఏర్పడేది. 

👉అంటే మన శరీరంలోని అతి పెద్ద మూలకం ఆక్సీజనే అన్నమాట. 

👉ఆక్సిజన్ అణువుల కన్నా హైడ్రోజన్ అణువుల సంఖ్య రకరకాలుగా ఉపయోగపడినా అన్నింటికన్నా ముఖ్యమైంది- శ్వాసక్రియలో ఎక్కువైనా ద్రవ్యరాశి విషయంలో ఆక్సిజన్లో పెద్ద పీట. 


👉ఇది మనకు పాల్గొంటూ శరీరానికి అవసరమైన శక్తినివ్వటం. మనం శ్వాస ద్వారా పీల్చుకునే ఆక్సిజన్ నేరుగా ఊపిరితిత్తుల్లోని గాలి గదుల్లోకి వెళ్తుంది. 


👉అక్కడ్నుంచి రక్తం ద్వారా కణాలకు చేరుకుంటుంది. కణ కేంద్రకమైన మైటోకాండ్రియా ఈ ఆక్సిజన్ సాయంతోనే పోషకాలను శక్తిగా మారుస్తుంది. 


👉అంటే తగినంత ఆక్సిజన్ లేకపోతే మన శరీరం చతికిల పడిపోతుందన్నమాట.


 👉"హానికారక సూక్ష్మక్రిములను, రక్తంలో విశృంఖలంగా సంచరించే కణాలను కట్టడి చేయటంలోనూ పాలు పంచుకుంటుంది. 


👉ఇంతటి మం కీలకమైనదైనా దాదాపు 230 ఏళ్ల క్రితం వరకు ఆక్సిజన్ ను గుర్తించనేలేదు. 


💥మహా సముద్రాల నుంచీ.. »💥


👉ఆక్సిజన్ అనగానే మనకు ముందుగా చెట్లే గుర్తుకొస్తాయి గానీ మన భూమి మీదుండే ప్రాణవాయువులో కనీసం 50-80% మహా సముద్రాల నుంచే పుట్టుకొస్తుంది. 


👉ఇందులో చాలావరకు మహా సముద్రాల్లోని అతి చిన్న ప్రాణులు (ప్లాంక్టన్), పాచి, కొన్ని రకాల బ్యాక్టీరియా జరిపే కిరణజన్య సంయోగ క్రియ నుంచే ఉత్పత్తి అవుతుంది. 


👉ముఖ్యంగా ప్రొక్లోరోకాకస్ అనే బ్యాక్టీరియా మొత్తం జీవావరణంలో 20% వరకు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలదు!


👉• సైయానోబ్యాక్టీరియా కిరణజన్య సంయోగక్రియతో 'శ్వాసించటం' ద్వారా కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ ను బయటకు విడుదల చేస్తుంది.


 👉భూమ్మీద మొట్టమొదటి ఆక్సిజన్ కు ఇదే మూలమని భావిస్తున్నారు.


 👉మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నిమిషానికి సగటున 7-8 లీటర్ల గాలిని లోపలికి పీల్చుకుంటాం, బయటకు వదులుతుంటామని అంచనా. 


👉ఇలా రోజుకు 11వేల లీటర్ల గాలిని శ్వాసిస్తుంటామన్నమాట. 


👉అయితే ఇదంతా ఆక్సిజన్ కాదు. పీల్చుకునే గాలిలో 20%, వదిలే గాలిలో 15% ఆక్సిజన్ ఉంటుంది. 


👉అంటే ప్రతి శ్వాసలో సుమారు 5% ఆక్సిజన్‌ను శరీరం వినియోగించుకుంటుందన్న మాట. 


💥ఎక్కువైతే ప్రమాదమే »💥


👉మనం జీవించటానికి  ఆక్సిజన్ అత్యవసరమే అయినా ఎక్కువైతే మాత్రం ప్రమాదమే. ఎందుకంటే ఇది ఆక్సిడెంట్. ఇతర పదార్థాల నుంచి ఎలక్ట్రాన్లను స్వీకరిస్తుంది. 


👉ఆక్సిజన్ స్థాయిలు మరీ ఎక్కువైతే శరీరం దీన్ని నెగెటివ్ శక్తితో కూడిన అయాగా విడగొడుతుంది. 

👉ఇది ఐరను అంటుకుపోతుంది. హైడ్రాక్సీల్ విశృంఖల కణం పుట్టుకొచ్చి కణాల పొరల్లోని కొవ్వులను దెబ్బతీస్తుంది.


💥మండిస్తుంది.. మండదు! »💥


👉ఆక్సిజన్ మండటానికి తోడ్పడుతుంది గానీ దానంతట అది మండదు. అలా మండేట్టయితే మనం అగ్గిపుల్ల ముట్టిస్తేచుట్టూ ఉన్న ఆక్సిజన్ మండిపోయేదే కదా. , 


👉ఇప్పుడంటే వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు ఒక స్థాయికి చేరుకున్నాయి గానీ చరిత్ర పూర్వ యుగంలో పెద్ద మొత్తంలో ఉండేవి. 


👉అందువల్ల జీవుల ఆకారాలు చాలా భారీగా ఉండేవట. ఉదాహరణకు- 30 కోట్ల ఏళ్ల క్రితం తూనీగలు పక్షులంత పెద్దగా ఉండేవి! 


👉మంచి నీటిలో ప్రతి లీటరుకు 6.04 ఎం.ఎల్ ఆక్సిజన్ ఉంటే.. సముద్రపు నీటిలో 4.95 ఎం.ఎల్ ఉంటుంది.


Share on:

 How to get e pass for inter district and inter state journey in lockdown in Telangana


💥*కోవిడ్19 యొక్క వ్యాప్తిని నిలువరించుటకు తెలంగాణలో లాక్‌డౌన్ ప్రకటించినందున, ఏదైనా అత్యవసర అంతర్-జిల్లా లేదా అంతర్-రాష్ట్ర ప్రయాణాలకు ముందస్తు అనుమతి/e-పాస్ తప్పనిసరి. 

👉ఈ e-పాస్ ను సిటిజెన్ సర్వీస్ పోర్టల్నుండి సంబంధిత పత్రాలను సమర్పించి పొందగలరు.*

👉 సిటిజన్ సర్వీస్ పోర్టల్ కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి 👇👇👇


Click here 


👉కింది చిత్రాల ఆధారంగా మీరు దరఖాస్తు నింపవచ్చు.👇👇👇👇




💥వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది.💥


 👉ప్రస్తుత కరోనా మహమ్మరి కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ఆన్‌లైన్‌ ద్వారా సేవలందించాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది.

 👉మొత్తం 17రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందించడానికి ‘ఎక్కడైనా - ఎప్పుడైనా (ఎనీవేర్‌ - ఎనీటైమ్‌)’ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికోసం ఇప్పటికే రాష్ట్రంలో అందుబాటులో ఉన్న టీ-యాప్‌ ఫోలియో ద్వారా సేవలు అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు బుధవారం తెలియజేశారు.


👉టీ-యాప్‌ ఫోలియో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకొని తర్వాత మీకు కనిపించే ఆర్టీఏ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే 17 రకాల సేవలు కనపడుతాయి. 

  👉అందులో మనకు అవసరమైన దానిపైన క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 


👉డూప్లికేట్‌ లైసెన్స్‌, ఇష్యూ ఆఫ్‌ బ్యాడ్జ్‌, స్మార్ట్‌కార్డు, లైసెన్స్‌ హిస్టరీ షీట్‌, డూప్లికేట్‌ లెర్నర్‌ లైసెన్స్‌, డూప్లికేట్‌ పర్మిట్‌, పర్మిట్‌ రెన్యువల్‌, టెంపరరీ పర్మిట్‌ లాంవంటి 17 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని కమిషనర్ తెలిపారు.

Share on:

 Covid -19 Effect in childrens 

Covid -19 ప్రభావం

 చిన్నపిల్లల్లో ఎక్కువగా

   

👉నిజానికి మన శరీరం మీద వైరస్ ఉన్నా అదేమీ చేయదు. లోపలికి ప్రవేశిస్తేనే సమస్య. 


👉ఇది ఒంట్లోకి ప్రవేశించటానికి మార్గం చూపేవి ఆయా అవయవాల కణజాలంలోని ఏస్-2 గ్రాహకాలు. 

వైరస్ మీదుండే ముల్లు ప్రొటీన్ ఏస్-2 గ్రాహకాలకు అంటుకోవటం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం తామరతంపరగా వృద్ధి చెందుతూ ఇన్ ఫెక్షన్‌కు దారితీస్తుంది. 




👉చిన్న పిల్లల్లో ఏస్-2 గ్రాహకాలు చాలా చాలా తక్కువ. ఉన్నా అంత చురుకుగా ఉండవు. మొదట్నుంచీ పిల్లలను కరోనా ముప్పు నుంచి కాపాడుతోంది ఇదే. 




👉కానీ ఇప్పుడిది పిల్లలకు ఎక్కువగానే సోకుతోంది. గత సంవత్సరం 100 మందిలో ఒక చిన్నారికి సార్స్-కో వీ-2 పాజిటివ్ గా కనిపించేది.




 👉ఇప్పుడు 20 మంది పిల్లల్లో పాజిటివ్ గా తేలుతోంది. అంటే 20 రెట్లు పెరిగిందన్నమాట. ప్రస్తుతం 6-15 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. 




👉నెలల పిల్లల్లోనే కాదు, అప్పుడే పుట్టిన పిల్లల్లోనూ దీన్ని చూస్తున్నాం. 




💥దీనికి కారణమేంటి? 💥



👉కొవిడ్-19 నివారణ పట్ల నిర్లక్ష్యం చూపటం. మొదట్లో మాస్కులు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలు బాగానే పాటించారు.




 👉రాన్రాను కేసులు తగ్గటం, అంత ఉద్ధృతంగా దాడి చేయకపోవటం వల్ల 'ఇదేం చేస్తుందిలే' అనే భావన నెలకొనటమే ఇప్పుడు కొంప ముంచుతోంది. 

తొలిదశలో కరోనా జబ్బు పిల్లలకు అంతగా సోకకపోవటం, సోకినా లక్షణాలేవీ లేకుండానే సురక్షితంగా బయటపడటం కూడా కొంత ధైర్యం కలిగించింది. 


👉ఇవన్నీ ఒకరకంగా నిర్లక్ష్యానికే దారితీశాయి. ఇదే మలిదశలో వైరస్ విస్తృతంగా దాడి చేయటానికి, పిల్లలకూ హానికరంగా పరిణమించటానికి వీలు కల్పిస్తోంది. 


👉మరో ముఖ్య కారణం- సార్స్-కోవీ 2 కొత్త రూపు సంతరించుకోవటం. వైరస్ తన మనుగడ కోసం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అది దాని సహజ గుణం, సాధారణంగా 95% మార్పులు పెద్దగా హాని కలిగించవు.


 👉ఏస్-2 గ్రాహకాలతో అంటుకునేలా చేసే మార్పులే ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. బి.1.187 రకం వైరస్లో జరుగుతోంది. ఇదే.

 💥గాలి ద్వారా వ్యాపించటంతోనూ..💥


👉ఇంతకుముందు వైరస్ పెద్ద తుంపర్లతోనే వ్యాపిస్తుందని, ఇతరులకు 6 మీటర్ల దూరంలో ఉంటే సురక్షితమని భావించేవారు. 


👉కానీ కరోనా వైరస్ సూక్ష్మ తుంపర్లతోనూ.. అంటే మాట్లాడినప్పుడు, శ్వాస వదిలినప్పుడు బయటకు వచ్చే కంటికి కనిపించని తుంపర్లతోనూ వ్యాపిస్తున్నట్టు లాన్సెట్ వైద్య పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ఇలాంటి సూక్ష్మ తుంపర్లు గాలిలో చాలా సేపు తేలియాడగలవు. 


👉ఇలా ఇది గాలి ద్వారానూ వ్యాపిస్తోందన్నమాట. పిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్లకపోయినా కూడా కరోనా సోకుతుండటానికి కారణమిదే. 


👉రకరకాల పనుల మీద బయటకు వెళ్లి వచ్చే పెద్దవాళ్ల ద్వారా పిల్లలకు అంటుకుంటోంది. 


👉వైరస్ సోకినా అందరిలో అన్నిసార్లూ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి వాళ్లు వదిలే శ్వాస ద్వారా పిల్లలకు సోకుతోందని గుర్తించటం అవసరం.

👉 కాబట్టే రెండో దశలో కరోనా వైరస్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.




💥 ఎక్కడి పిల్లలు అక్కడే💥



👉మొదట్లో పిల్లల నుంచి పెద్దవాళ్లకు వైరస్ అంతగా వ్యాపించదనే భావించేవారు. 




👉కానీ పిల్లల ద్వారానూ ఎక్కువగానే ఇతరులకు సోకుతున్నట్టు ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి.




 👉పిల్లల గొంతు, ముక్కులో అంత ఎక్కువగా వైరస్ లేకపోవచ్చు. లక్షణాలు లేకపోవచ్చు. అలాగని ఇతరులకు వైరస్ సోకదని అనుకోవటానికి లేదు. లక్షణాల తీవ్రతకు వైరస్ సంఖ్యకు సంబంధం లేదు. 




👉లక్షణాలు కనిపించనంత మాత్రాన పిల్లల్లో వైరస్ లేదనుకోవద్దు. లక్షణాలున్నా లేకపోయినా వైరసను వ్యాపింపజేసే అవకాశముంది. 




👉పిల్లలు ఒకదగ్గర కుదురుగా కూర్చోరు. అందరి దగ్గరికి వెళ్తుంటారు. అందువల్ల వైరసను మరింత త్వరగా, ఎక్కువగా వ్యాపింపజేసే ప్రమాదమూ ఉంది. 




👉ప్రస్తుతం గాలి ద్వారా వ్యాపిస్తుండటం వల్ల ఇంట్లో పెద్దవాళ్ల నుంచైనా, బయట ఇతర పిల్లల నుంచైనా ఎక్కడ్నుంచైనా వైరస్ అంటుకునే అవకాశముందని గుర్తించాలి. 




👉చాలామంది చేస్తున్న పొరపాటు ఇంట్లో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపించగానే పిల్లలను ఊళ్లకు పంపించేయటం. ఇది మంచి పద్ధతి కాదు. 


👉ఇంట్లో ఒకరికి కొవిడ్ వచ్చినా, కొవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించినా అందరికీ జబ్బు వచ్చినట్టుగానే పరిగణించాలి.




 👉పిల్లలను ఊళ్లకు పంపిస్తే అక్కడి వాళ్లకూ వైరస్ అంటుకునే అవకాశముంది.

👉కాబట్టి ఎక్కడి పిల్లలను అక్కడే ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో వాళ్లంతా విధిగా సర్జికల్ మాస్కులు ధరించాలి. 




👉ఎత్తుకోవటం, ముద్దు పెట్టుకోవటం వంటివేవీ చేయొద్దు.


💥ప్రమాదం ఎవరికి ఎక్కువ? 💥



👉దీర్ఘకాల కిడ్నీ జబ్బు, కాలేయ జబ్బు, పుట్టుకతో గుండె లోపాలతో బాధపడేవారు... 




👉క్యాన్సర్ బాధితులు, రోగనిరోధక శక్తి తక్కువగా గలవారు, మతి స్థిమితం లేనివారు, టైప్ 1 మధుమేహులు, తీవ్రమైన ఊబకాయం, పోషణలోపం గలవారికి కొవిడ్-19 వస్తే వేగంగా విషమించే ప్రమాదముంటోంది. 




👉కాబట్టి వీరి విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.



🔥మూడు రకాలు 🔥



పిల్లల్లో లక్షణాలను బట్టి కరోనా జబ్బును మూడు రకాలుగా విభజించుకోవచ్చు.



💥మామూలు: 



👉సాధారణ శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ లక్షణాలను మామూలు జబ్బుగా భావించొచ్చు. వీరిలో కొద్దిగా జ్వరం, గొంతునొప్పి, ముక్కు కారటం, దగ్గు.. అలాగే విరేచనాలు, వాంతి, నలతగా ఉండటం కనిపిస్తుంటాయి. ఆయాసం ఉండదు. 




💥ఒక మాదిరి:



 👉జబ్బు ముదురుతున్న కొద్దీ శ్వాస వేగంగా తీసుకోవటం మొదలవుతుంది. ఈ దశలో కొందరికి రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కన్నా తక్కువకు పడిపోవచ్చు. కొందరిలో న్యుమోనియా ఆరంభం కావొచ్చు.






💥తీవ్రం, విషమం: 



👉తీవ్ర దశలో న్యుమోనియా ఎక్కువవుతుంది. ఆక్సిజన్ శాతం 90 కన్నా పడిపోవచ్చు. 




👉శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి కావటం, డొక్కలు ఎగరేయటం వంటివీ ఉండొచ్చు. 




👉ఇలాంటి సమయంలో బయటి నుంచి ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది.




 👉సమస్య ఇంకా తీవ్రమవుతున్న కొద్దీ నిస్సత్తువ, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక మత్తుగా నిద్రపోవటంతో పాటు కొందరికి మూర్ఛ. తలెతొచ్చు. 




👉విడవకుండా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి సైతం వేధించొచ్చు. సమస్య మరీ విషమిస్తే- శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, షాక్ లోకి వెళ్లిపోవటం.. 

👉కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు విఫలం కావటం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడటం వంటివి తలెత్తుతాయి. 


👉వీరిని అత్యవసర విభాగంలో చేర్చి, వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.



 ఎప్పుడు అనుమానించాలి?


ఆరేళ్లు దాటిన పిల్లల్లో పెద్దవాళ్లలో మాదిరి లక్షణాలే కనిపించినప్పటికీ కొన్నిసార్లు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు. మామూలు జలుబు, వైరల్ జబ్బులాగా అనిపించొచ్చు. చాలామంది పిల్లలు ఒకట్రెండు వారాల్లో వీటి నుంచి కోలుకుంటారు. అయినా ఆయా లక్షణాల గురించి తెలుసుకొని ఉండటం మంచిది. ప్రధానమైన లక్షణాలు ఇవీ..


జ్వరం 


చలి ఉండొచ్చు/లేకపోవచ్చు.


నిస్సత్తువ, అలసట


తలనొప్పి, ఒళ్లు నొప్పులు 


ముక్కుదిబ్బడ, దగ్గు, గొంతునొప్పి


 • శ్వాస వేగంగా తీసుకోవటం 


* వికారం, వాంతి, విరేచనాలు 


* విడవకుండా కడుపునొప్పి ܀


ఆహారం సరిగా తినకపోవటం, ఆకలి లేకపోవటం.. రుచి, వాసన తగ్గటం.


💥చికిత్స - లక్షణాలను బట్టి


👉మామూలు జబ్బుకు పిల్లలకు ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదు. మంచి ఆహారం తినేలా, తగినంత నీరు తాగేలా, విశ్రాంతి తీసుకునేలా చూసుకుంటే చాలు. 


👉అవసరమైతే ఆయా లక్షణాలను పారాసిటమాల్, మందు, గొంతునొప్పికి ఉప్పునీరు పుక్కిలించటం,

 👉కడుపునొప్పి, విరేచనాలకు తగు మందులు అవసరమవుతాయి. 


👉పెద్దవాళ్ల మాదిరిగా వీరికి యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండు, మూడు రోజులు దాటినా జ్వరం తగ్గకుండా, ఇంకా ఎక్కువవుతూ వస్తున్నప్పుడే యాంటీబయోటిక్స్ ఆరంభించాలి.


 👉అదీ రక్త పరీక్ష చేసి, సీఆర్‌పీ వంటివి ఎక్కువగా ఉంటేనే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.


👉ఒక మాదిరి, తీవ్ర జబ్బు గలవారిని ఆసు చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. వీరికి బయ నుంచి ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది.


 అవసరా తగు ఇంజెక్షన్లు, స్టిరాయిడ్లు, ఇమ్యునోగ్లోబులినా సెలైన్ ఇస్తారు. పిల్లలకు రెమ్ డెసివిర్, టొసిలి లాంటి ఇంజెక్షన్ల అవసరం చాలా అరుదు. ఏ విషయంలో గాబరా పడొద్దు.


 

Share on:

 

Postal Driver Jobs Notification PDF 

👉No Exam

👉Apply Through Speed post

👉Those who want to download this

Notification and Application form

Click on the link given below 👇👇

👉No Exam

👉Apply Through Speed post


Notification PDF


Application Form


Share on:


How To Apply For T-SEVA Center Online in Telangana 2021 

       

➡️How To Apply For T-SEVA Center Online in Telangana 2021

➡️Those who want to apply for T SEVA Center

➡️online in telangana click on the link

➡️Given below.👇👇

👇👇👇👇👇👇



   APPLY LINK
Share on:

 May 2021 Current Affairs for All Competitive exams            

 

👉2021 మే నెల కు సంబంధించిన పూర్తి కరెంట్ అఫైర్స్ ని క్రింది లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.

👉 ఈ కరెంట్ అఫైర్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో అన్ని పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు చాలా ఉపయోగపడుతుంది.

👉Pdf లింక్👇👇👇
May 2021 Current Affairs



Share on:


Teachers Data confirmation process

రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ ఆదేశానుసారం...


School education website లో మన service particulars కు సంబంధించిన వివరాలను ఒకసారి check చేసుకుని, update చేసుకోవలెను... క్రింది సూచనల ఆధారంగా కేవలం 5 నిముషాలలో మీ వివరాలను update చేసుకొనవచ్చును.....







ఉపాధ్యాయ డేటా ధృవీకరణ ప్రక్రియ



 1. క్రింది వెబ్సైట్ లోకి వెళ్ళండి...

👇👇👇


  https://schooledu.telangana.gov.in/ISMS/



 2. *online services* మెనూపై క్లిక్ చేయండి.



 3. *Teachers data verification by teachers* పై క్లిక్ చేయండి.



 4. టీచర్ మొబైల్ నంబర్ మరియు employee idని నమోదు చేయండి



 5. ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది.



 6. OTP ఎంటర్ చేసిన తరువాత, డేటా కనిపిస్తుంది



 7. అందుబాటులో ఉన్న సమాచారాన్ని చెక్ చేసుకోండి.



 8. అవసరమైన సమాచారాన్ని type చేయండి...



9. తర్వాత update చేయండి..



👇👇👇


Website link  


ఈ ప్రక్రియ కేవలం 5 నిమిషాల్లో ముగుస్తుంది...


 కాబట్టి అందరూ... త్వరగా మీ మీ టీచర్ డాటా కన్ఫర్మేషన్ ను నమోదు చేయగలరు...


(గమనిక: ఈ ప్రక్రియ mobile phone మరియు tab లలో పనిచేయదు...కేవలం desktop లలో మాత్రమే పనిచేస్తుంది..గమనించగలరు..)

Share on:
  • ← Previous post
  • Next Post →
Labels
  • :-IPL T20 schedule released
  • #TSSPDCL# Tsspdcl JLM pole climbing 1:2 ratio list released
  • 30% PRC announcement from TS government to all employees
  • Acharya NG ranga Agricultural university jobs notification 2020
  • Activities for primary school children at home in lockdown period
  • becil jobs
  • Covid-19 పై పబ్లిక్ ప్రశ్నలు- సమాధానాలు
  • CRPF Constable Recruitment Notification 2020
  • Current Affairs for all competitive exam free online test 3/2/21
  • Current Affairs for all competitive exams
  • Current Affairs free online test -1
  • Current Affairs practice bits
  • day wise schedule
  • DEEKSHA app -useful to teachers and students
  • DEPARTMENTAAL TEST TIME TABLE - MAY 2020 SESSION
  • deposit of NMMS scholarship latest update 2021
  • Do you know how to name storms?
  • GHMC 2020 Election Voterslips Download.
  • High Court judgment on bubbling of OMR sheets issue
  • How to apply Hyderabad Amazon 20000 jobs in online
  • How to calculate LRS amount in 1 minute
  • How to download pahani and 1B details in dharani portal telangana
  • How to Download PMSBY and PMJJBY Bonds Online
  • How to view application status of mlc vote and registration process
  • IBPS బ్యాంకు (1167) ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
  • ICICI BANK jobs Recruitment 2021
  • Important General knowledge bits for all competitive exams
  • Important instructions to TG V CET gurukula selected students
  • JRF posts in DRDO Hyderabad;డీఆర్‌డీవో
  • July 2020 month pay slip
  • June 2020 pay slip
  • Karimnagar district hospital jobs notification
  • Kendriya vidyalaya admissions 2020-21
  • know your Group 4 hall ticket number and TSPSC ID
  • Know your land details in Telugu
  • Latest contract jobs
  • Latest outsourcing jobs in Telangana 2021
  • Latest outsourcing jobs in telangana gurukulas
  • Manage recruitment 2020
  • MBNR expected promotoins
  • national means cum merit scholarship amount
  • New PRC salary particulars At one click
  • NMMS scholarship
  • NTPC recruitment notification 2020
  • Permanent central govt jobs
  • PM KISAN 10th INSTALLMENT BENFICIARY LIST RELEASED
  • PM కిసాన్ క్రెడిట్ కార్డు కు అప్లై చేయు విధానము
  • Property tax details in WhatsApp
  • ration card apply
  • Ration card status
  • Reliance Jio jobs notification 2020
  • RPS -2018 Basic pays PDF
  • RRB NTPC పరీక్షల తేదీలు విడుదల
  • RRB NTPC సిలబస్ తెలుగు & ఇంగ్లీష్ లో
  • sangareddy and medchal districts
  • Sardar vallabhbhai Patel National Police academy Hyderabad
  • SBI jobs notification 2020
  • SBI PO recruitment notification 2020
  • SBI లో 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల
  • Sonu Sood scholarship applicationn link 2021
  • SSC marks memo download
  • suryapet JLM pole climbing 1:2 list
  • TECH Mahindra Work from home jobs 2021
  • TELANGANA ENTRANCE EXAM DATES RELEASED
  • Telangana Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana high court interviews official update
  • Telangana junior Panchayat secretary khammam district 5th list released
  • Telangana Minority Gurukula outsourcing junior lecturer jobs exam latest update
  • Telangana Postal department GDS notification 2021
  • Today's job and education updates in all news papers 11/2/21
  • Today's జాబ్ & ఎడ్యుకేషన్ అప్డేట్స్ 24/10/20
  • TS court jobs 2021 latest update
  • TS All Teachers IFMIS Monthly payslip download :-
  • TS CPS employees PRAN details
  • TS DEECET-2020
  • TS employees monthly salary slips download
  • TS high court revised interview dates released
  • TS NREGA ombudsperson jobs recruitment
  • Ts outsourcing jobs recruitment notification 2021
  • TS Pollution control board jobs notification 2020
  • TS polycet Results 2022 released
  • TS polycet ఫలితాలు విడుదల
  • TS SCERT English language enrichment program Live Webinar
  • TS TET Psychology free online test part -3
  • TSGLI Bond Information
  • TSPSC FBO 3rd spell physical test and events district wise
  • TSPSC నుండి 2 కొత్త నోటిఫికషన్లు విడుదల
  • TSSPDCL 2019 JLM pole climbing dates released in 3 districts
  • TSSPDCL 2019 JLM revised ranks released
  • TSSPDCL JACO court case date
  • TSSPDCL JLM call Letters released
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 2 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 3 districts
  • TSSPDCL JLM Pole climbing 1:2 list released in 4 districts.
  • TSSPDCL JLM Pole climbing 1:2 selection list of 3 more districts
  • TSSPDCL Jr అసిస్టెంట్ కోర్ట్ కేసు అప్డేట్
  • TTD jobs notification 2020
  • Useful App for Departmental Tests
  • అటవీ శాఖ నుండి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్
  • అమెజాన్ నుంచి మరొక బంపర్ job నోటిఫికేషన్
  • ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌(TOSS)
  • ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • ఉపాద్యాయ
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ - 15/8/2020
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ jan 17th 2021
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ అక్టోబర్ 22-10-20
  • ఎడ్యుకేషన్ అప్డేట్స్ డిసెంబర్ 26 -2020
  • ఓపెన్ టెన్త్
  • కరెంట్‌అఫైర్స్‌ ప్రాక్టీస్ బిట్స్ - 15.04.2021🔥
  • కరోనా లక్షణాలు - సాదారణ జలుబు
  • టీఎస్ అకాడమిక్ క్యాలెండర్ 2020-21
  • తెలంగాణ ఇరిగేషన్ శాఖ లో 2000 వర్క్ ఇన్స్పెక్టర్ ఖాళీలు.!
  • తెలంగాణ ఉద్యోగ
  • తెలంగాణ ఉపాధి హామీ లో ఉద్యోగాలు
  • తెలంగాణ గురుకులాలలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • తెలంగాణ గురుకులాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల కు అప్లై చేసే విధానం
  • తెలంగాణ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖలో 845 ఖాళీలు
  • తెలంగాణ పదవ తరగతి ఫలితాల విడుదల...
  • తెలంగాణ పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
  • నవోదయ నోటిఫికేషన్ 2021
  • నిరుద్యోగులకు కేంద్రం GOOD NEWS... ONE NATION..ONE EXAM.
  • నూతన జాతీయ విద్యా విధానం - 2020 ; ముఖ్యాంశాలు
  • పెంఛనర్లకు శుభవార్త...!
  • పెరుగుదల వికాసం slip test-2 part - 2 Growth and development
  • ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ 2020
  • ఫ్లూ లక్షణాలు
  • రాఫెల్ యుధ్ధ విమానాలు - క్విజ్
  • రైతులకు ఉపయోగoగా ధరణి వెబ్సైట్
  • విద్యాశాఖ వర్క్‌షీట్లు విడుదల
  • వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం
  • సశాస్త్ర సీమాబల్ నుంచి భారీ నోటిఫికేషన్
  • హైదరాబాద్ మింట్ ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
  • హైదరాబాద్‌లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీలు
latest posts
latest comments

PSK education

AN EDUCATIONAL WEBSITE

  • Home
  • About us
  • Contact us
  • Site map
  • Disclaimer
  • Privacy policy
  • Terms and conditions
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates