TRT 2023 Notification Released
తెలంగాణ 5089 పోస్టులకు TRT notification విడుదల అయింది.
ముఖ్యమైన తేదీలు :-
DSC-2023 Notification
👉Notification available in website from 15-09-2023
👉Fee payments from 20-09-2023 to 20-10-2023
👉Online application from 20-09-2023 to 21-10-2023
👉Exams ( CBT)From 20-11-2023 to 30-11-2023
👉To get Detailed notification click the link given below 👇👇👇👇👇👇👇👇👇👇
Notification pdf
నవంబరు 20 నుంచి TRT
*🔶ఆన్‌లైన్‌లో పరీక్షలు...11 జిల్లా కేంద్రాల్లో సెంటర్లు*
ఈ నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ*
5,089 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
నవంబరు 20 నుంచి 30వ తేదీ మధ్య కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(సీబీటీ) నిర్వహించనున్నారు.
అర్హులైన అభ్యర్థులు ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈమేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే 5,089 ఉపాధ్యాయ ఖాళీలతోపాటు మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు టీఆర్‌టీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఇటీవలే ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఈక్రమంలోనే నోటిఫికేషన్‌ను జారీ చేశారు.
సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితుల పోస్టులను భర్తీ చేస్తారు.
అయితే ఈ నోటిఫికేషన్‌లో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఖాళీల భర్తీ గురించి ప్రస్తావించలేదు.
తొలిసారిగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 44 సంవత్సరాలు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు సడలింపు ఇస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. దివ్యాంగులకు మాత్రం పది సంవత్సరాల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు రూ.వెయ్యిగా నిర్ణయించారు. ఈనెల 20 నుంచి అక్టోబరు 20 వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తును దాఖలు చేసే దశల వారీ ప్రక్రియ, జిల్లా వారీగా ఖాళీలు, ఇతర వివరాలన్నీ ఈనెల 15 నుంచి www.schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ పేర్కొంది.