KGBV Notification 2023
రాష్ట్రంలోని కేజీబీవీ పాఠశాలలో కేవలం మహిళలకు మాత్రమే 1241 పోస్టులను ఎస్ఓ,పిజిసిఆర్టి సిఆర్టి ,ఇలా పలు సబ్జెక్టుల వారిగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది లింకును క్లిక్ చేసి పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.👇👇👇👇
Apply చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి,,👇👇👇👇👇👇👇
తెలంగాణ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా
O/o రాష్ట్ర పథక సంచాలకులు
సమగ శిక్షా, తెలంగాణ
హైదరాబాద్.
పత్రికలో ప్రచురణార్థము
తేది 16.06.2023
రాష్ట్రములోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (KGBV) లోని Special Officer, PGCRT, CRT, PET ల మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల (URS) లోని Special Officer మరియు CRTల ఖాళీలను తాత్కాలిక కాంటాక్ట్ పద్దతిలో భర్తీకై అర్హత మరియు అసక్తి కలిగిన అభ్యర్థుల నుండి Online ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి.
ప్రాథమికంగా గుర్తించబడిన మొత్తం ఖాళీల సంఖ్య 1241 (SOలు 42, PGCRTలు 849, CRTలు 273 & PETలు 77). జిల్లాల వారిగా ఖాళీల జాబితా వెబ్సైట్ నందు పొందుపరచబడును.
కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లోని ఖాళీల భర్తీకి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విద్యార్హతలు, వ్రాత పరీక్ష విధానం, వ్రాత పరీక్ష సిలబస్ మరియు అభ్యర్థుల ఎంపిక విధానం తదితర వివరములు గల సమగ్ర నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ website https://schooledu.telangana.gov.in నందు తేది: 17.06,2023 నుండి అందుబాటులో ఉండును.
. దరఖాస్తు, ఖాళీలు మరియు ఇతర వివరములు పాఠశాల విద్యాశాఖ website https:// schooledu.telangana.gov.in నందు తేది: 25.06.2023 నుండి అందుబాటులో ఉండును.
దరఖాస్తుల సమర్పణ తేదీలు :
. TS TEACHERS INFO పాఠశాల విద్యాశాఖ website https://schooledu.telangana.gov.in నందు అసలైన్లో అభ్యర్థుల యొక్క దరఖాస్తుల సమర్పణ తేది: 26.06.2023 నుంచి 05.07.2023 వరకు
పాఠశాల విద్యాశాఖ website https://schooledu.telangana.gov.in నందు అన్లైన్లో అభ్యర్థులచే దరఖాస్తుల సమర్పణకు చివరి తేది: 05.07.2023 సాయంత్రం 5:00 గంటల వరకు
కావున ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ website https:// schooledu.telangana.gov.in నందు అన్లైన్లో పైన సూచించిన తేదీల్లో దరఖాస్తును సమర్పించవచ్చును. వ్రాత పరీక్షలు జూలై మాసములో ఎంపిక చేయబడిన పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ పద్ధతిలో అబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడును.