వినాయక చవితి - అసలు ప్రాశస్త్యం.
👉ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన వినాయకుని పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం.
👉భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రమున రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.పురాణాల్లో వినాయకచవితి గురించి కొన్ని కథలున్నాయి.
👉పూర్వం గజరూపం కల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు.. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో.. ఆ రాక్షసుడు స్వామీ నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి.. అని కోరాడు. మాట తప్పని మహాశివుడి రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోకి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి..
👉ఎంతో బాధతో మహావిష్ణువును ప్రార్థించి.. గజాసురిని బారి నుంచి శివుడిని కాపాడమని కోరింది. దీంతో.. శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి నందిని ఆడిస్తాడు.
👉ఆ మేళాని తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అంటూ వరమిస్తాడు.
💥వినాయకుడి బహుముఖ రూపాలు:-
👉ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి..'ఈ నందీశ్వరుడు... శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడుగుతాడు .
👉వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మమును నీ వస్త్రముగా ధరించమని' వేడుకుంటాడు. అనంతరం..
👉విష్ణుమూర్తి సైగ చేయడంతో నంది తన కొమ్ములతో గజాసురిని చీల్చి చంపుతుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి.. దుష్టులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వొద్దంటూ నచ్చజెప్పుతాడు.
💥వినాయక జననం💥
👉కైలాసంలో పార్వతీ దేవి.. శివుని రాక ఎదురుచూస్తూ నలుగుపెట్టుకుంటుంది. ఆ సమయంలో కిందరాలిన నలుగుపిండితో ఒక బాలుని రూపాన్ని తయారుచేసి.. ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వొద్దంటూ చెబుతుంది.
👉అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛదముగావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతీ శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో.. గజాసురిని శిరస్సుని అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు. గజముఖాన్ని పొందాడు కాబట్టి.. అతను గజాననుడిగా పేరు పొందాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి ఉద్భవిస్తాడు.
💥వినాయకచవితి..💥
👉ఒక రోజు స్వర్గలోకంలో దేవతలు, మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్లి 'ఏ పనిచేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరుతారు.
👉అందుకు తామే సరైన వారిమని వినాయకుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడతారు. అప్పుడు.. పరమేశ్వరుడు.. ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు.
👉'మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో.. వారే ఈ పదవికి అర్హులు' అని చెబుతాడు. దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్లిపోతాడు.
👉 వినాయకుడు మాత్రం.. తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తిచేయగలను అనే సందేహాన్ని శివుడి ముందుంచుతాడు. అపుడు శివయ్య.. తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెబుతాడు.
👉 ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానం చేసినట్టవుతుందని తెలుపుతాడు. ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఆ మంత్రాన్ని ముల్లోకలములకు సమానమైన తల్లీదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీంతో.. కుమార స్వామికి, మూడు కోట్ల యాభై నదులలో, ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించే వాడు.
👉అన్ని నదులూ తిరిగి, కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు.
విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి.. 'తండ్రి, అన్న మహిమ తెలియక తప్పు చేశా.. నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి' అన్నాడు.
👉 అలా బాధ్రపద శుద్ధ చవితిరోజున గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు.
ప్రతీకాత్మక చిత్రం:
👉ఆ రోజున భక్తులందరూ భోజనప్రియుడైన వినాయకుడికి పిండివంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనే, అరటిపళ్లు ఇలా నైవేద్యం పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్నీ కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి.
👉ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వడంతో.. వినాయకుడి పొట్టపగులుతుంది. అది చూసి పార్వతి దేవి శాపం ఇవ్వడం.
👉ఆ తర్వాత ఋషి పత్నులు నీలాపనిందలు మోయడం. ఆ పై పార్వతి దేవి... వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాపనిందలు పాలు కారని చెబుతారు. అందుకే వినాయక చవితి రోజు..
👉వినాయకుని కథ చదివి, అక్షింతలు నెత్తిన వేసుకున్న వారికి ఎలాంటి నీలాపనిందలు ఉండవని చెబుతారు.