Ap, తెలంగాణ విద్యార్థులు నెలకు 5000/- స్కాలర్ షిప్ పొందడం ఎలా.?

Ap, తెలంగాణ విద్యార్థులు నెలకు 5000/- స్కాలర్ షిప్ పొందడం ఎలా.?


మారుతున్న కాలంతో పాటే ఖర్చులు పెరుగుతున్నాయి. 

👉గడిచిన నాలుగైదేళ్లలో విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు రావడంతో విద్య చాలా ఖరీదైపోయింది. 


👉ధనవంతులకు ఎటువంటి సమస్య లేదు కానీ సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పిల్లలను చదివించుకోవడానికి పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. 


👉దీంతో చాలామంది విద్యార్థులు స్కాలర్ షిప్ లపై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు.


👉తాజాగా డిగ్రీ చదివే విద్యార్థులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు శుభవార్త చెప్పింది. 


👉డిగ్రీ చదివే విద్యార్థులకు 5000 రూపాయల స్కాలర్ షిప్ ఇవ్వడానికి ఐ.ఐ.ఎస్.సీ బెంగళూరు సిద్ధమైంది. iisc బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన-kvpy పేరుతో అందిస్తున్న ఫెలోషిప్స్ కు ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

💥     http://kvpy.iisc.ernet.in/main/index.htm   వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐ.ఐ.ఎస్.సీ చెబుతోంది.


👉డిగ్రీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి మొదట ఐ.ఐ.ఎ.సీ ఈ నెల 5వ తేదీని చివరి తేదీగా మొదట ప్రకటించగా ఆ తరువాత ఆ తేదీని అక్టోబర్ 19వ తేదీకి పొడిగించింది. 


👉దరఖాస్తు చేసిన విద్యార్థులు 2021 జనవరి నెల 31వ తేదీన జరిగే యాప్టిట్యూడ్ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది. 

👉తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇరు రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.


👉ఈ జిల్లాలలో తెలంగాణలోని మూడు జిల్లాలోని ఏపీలోని ఐదు జిల్లాలు ఉన్నాయి. ఐ.ఐ.ఎస్.సీ మాస్టర్స్ విద్యార్థులకు 7,000 రూపాయలు, డిగ్రీ విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఫెలో షిప్స్ అందిస్తుంది. 

👉దరఖాస్తు చేయడానికి ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు ఫీజు 1,250 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 625 రూపాయలు.. 


 

0 Comments