sbi job notification for 8500 post


 sbi job notification for 8500 post

          


తెలుగు రాష్ట్రాల్లో Sbi 8500 apprenticeship పోస్టులకు నోటిఫికేషన్

దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చేనెల 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8500 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుంది. మొదట రాతపరీక్ష నిర్వహిస్తుంది. అందులో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తుంది. అంటే అభ్యర్థులకు స్థానిక భాషలపై పట్టు ఉండాలి. మూడేండ్ల కాలపరిమితికి అప్రెంటిస్‌ను నియమిస్తుంది. అప్రెంటిస్ కాలంలో మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16500, మూడో ఏడాది రూ.19 వేలు స్టయిఫండ్‌గా చెల్లిస్తుంది. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్ అందిస్తుంది. దీనిని ఎస్‌బీఐతోపాటు ఇతర ప్రైవేట్ బ్యాంకులు నియామకాల సందర్భంగా పరిగణనలోకి తీసుకుంటాయి. మనకు 11 వందల పోస్టులు దేశవ్యాప్తంగా 8500 పోస్టులు ఉన్నాయి. అందులో తెలంగాణలో 460, ఆంధ్రప్రదేశ్‌లో 620 ఖాళీల చొప్పున ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్థానిక అధికారిక భాషలైన తెలుగు లేదా ఉర్దూపై పట్టు ఉండాలి. అయితే ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు: 8500 ఇందులో జనరల్ 3595, ఓబీసీ 1948, ఈడబ్ల్యూఎస్ 844, ఎస్సీ 1388, ఎస్టీ 725 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల లోపువారై ఉండాలి. ఎంపిక ఎలా? అభ్యర్థులను రాతపరీక్ష, లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్‌నెస్‌, జనరల్ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు. ప్రతి సబ్జెక్టును 15 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. సమాధానాలు తప్పుగా రాస్తే 1/4 వంతు మార్కులు కోతవిధిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే పదో తరగతి లేదా ఇంటర్ వరకు స్థానిక లేదా మాతృ భాషలో చదివినట్లు మార్కుల మెమో లేదా ధ్రువీకరణ పత్రం సమర్పించినవారికి పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అంటే రాతపరీక్షతోనే నేరుగా ఎంపికవుతారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 20 దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10 పరీక్ష: 2021, జనవరిలో.

👉నోటిఫికేషన్ pdf :- Click here

Online apply link :- Click here

0 Comments