Good news for SBI customers

Good news for SBI customers

 SBI ఖాతాదారులకు శుభవార్త

                          


దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన వినియోగదారులకు శుభవార్త అందించింది. 

👉ఇక నుంచి Sbi వినియోగదారులు ఇంట్లో నుంచే నామినీ పేరు జత చేసుకునే అవకాశం కల్పించింది. 

👉దీని కోసం ఇక నుంచి ప్రత్యేకంగా Bank కి  వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని SBI ట్విటర్ ద్వారా వెల్లడించింది.


👉మీరు బ్యాంక్ అకౌంట్‌ను నామినీ పేరును మూడు రకాలుగా add  చేయవచ్చు. 


👉బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం లేదా ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా SBI MOBILE Banking ద్వారా ఈ బెనిఫిట్ పొందొచ్చు.


👉ఒకవేల కనుక మీరు ఎస్‌బీఐ YONO యాప్ ఇంస్టాల్ చేసుకుంటే అందులోకి లాగిన్ అయిన తర్వాత కింద ఉన్న సర్వీస్ సర్వీసెస్ సెక్షన్‌లోకి వెళ్లాలి.


 👉ఇప్పుడు మీకు ఆన్‌లైన్ Nominee  కనిపిస్తుంది. దీని ద్వారా మీరు సులభంగానే మీ అకౌంట్‌కు నామినీ పేరు add చేయొచ్చు. 


👉బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ఏమైనా అనుకోకుండా  చనిపోతే అయితే అప్పుడు ఆ బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బులుపై నామినీకి పూర్తి అధికారం ఉంటుంది...


💥ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా :


👉మీరు మీ యూజర్‌పేరు, పాస్‌వర్డ్‌తో onlinesbi.com లోకి LOGIN  అవ్వండి.

👉Login అయిన తరువాత Menu నుంచి 'Request   &  Enquiry ' టాబ్ పై క్లిక్ చేయండి.

👉ఇప్పుడు ఆన్‌లైన్ నామినేషన్ ఎంపికను ఎంచుకోండి.

👉మీరు కొత్త నామినీని ఏ ఖాతాకు జోడించాలని అనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోండి.

👉ఇప్పుడు 'Proceed' టాబ్‌పై క్లిక్ చేయండి.

👉నామినీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఖాతాదారుడితో సంబంధిత వివరాలు నమోదు చేయండి.

👉ఇప్పుడు "సబ్మిట్" అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

👉మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన హై-సెక్యూరిటీ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

👉కొత్త నామినీని జోడించడానికి 'Confirm' టాబ్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది...

0 Comments