Saathi Training for telangana teachers
ఉపాధ్యాయులలో మానసిక ఒత్తిడిని తగ్గించే కార్యక్రమం
SAATHI పేరుతో అమలు
👉ఉపాధ్యాయులకు వర్చువల్ ప్లాట్ఫారం ద్వారా అవకాశం
👉పాఠశాలల్లో విద్యార్థులు సంతోషంగా విద్యనేర్చుకొనే వాతావరణాన్ని కల్పించేందుకు కార్యక్రమాలు రూపొందించిన విద్యాశాఖ, ఉపాధ్యాయులలో ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గించి వారిలోని ప్రతిభలను తోటి ఉపాధ్యాయులతో పంచుకోడానికి తద్వారా వారిలోని సృజనాత్మకతను మెరుగు పరుచుకోవడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, వర్చువల్ విధానంలో ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తుంది.
👉ఇందులో భాగంగా ఉపాధ్యాయులు వారిలోని సృజనకు తగ్గట్టుగా కథలు, పాటలు, నృత్యాలు, ఆటలు, సంగీతం, కవితలు, వారు తయారు చేసిన కళారూపాలు మొ. తోటి ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో వర్చువల్ విధానంలో ఆనందంగా తమలోని ప్రతిభను పంచుకోవచ్చు.
👉ఈ కార్యక్రమం భారత దేశంలో మొదటి సారిగా మన రాష్ట్రంలో చేపట్టడం జరుగుతుంది. ఉపాధ్యాయులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, వారిలో దాగి ఉన్న సృజనను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానోఉపయోగపడుతుంది.
👉ఈ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష అభియాన్ తెలంగాణ మరియు బ్లూ ఆర్బ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు.
👉ఈ వర్చువల్ ప్లాట్ఫారం లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు తేదీ 16.06.2021 నుండి 20.06.2021 లోపు క్రింద ఇవ్వబడిన గూగుల్ ఫార్మ్ ని నింపి వారి పేరును నమోదు చేసుకోగలరు.👇👇👇
👇👇👇👇
0 Comments