Covid -19 Effect in childrens
Covid -19 ప్రభావం
చిన్నపిల్లల్లో ఎక్కువగా
👉నిజానికి మన శరీరం మీద వైరస్ ఉన్నా అదేమీ చేయదు. లోపలికి ప్రవేశిస్తేనే సమస్య.
👉ఇది ఒంట్లోకి ప్రవేశించటానికి మార్గం చూపేవి ఆయా అవయవాల కణజాలంలోని ఏస్-2 గ్రాహకాలు.
వైరస్ మీదుండే ముల్లు ప్రొటీన్ ఏస్-2 గ్రాహకాలకు అంటుకోవటం ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం తామరతంపరగా వృద్ధి చెందుతూ ఇన్ ఫెక్షన్‌కు దారితీస్తుంది.
👉చిన్న పిల్లల్లో ఏస్-2 గ్రాహకాలు చాలా చాలా తక్కువ. ఉన్నా అంత చురుకుగా ఉండవు. మొదట్నుంచీ పిల్లలను కరోనా ముప్పు నుంచి కాపాడుతోంది ఇదే.
👉కానీ ఇప్పుడిది పిల్లలకు ఎక్కువగానే సోకుతోంది. గత సంవత్సరం 100 మందిలో ఒక చిన్నారికి సార్స్-కో వీ-2 పాజిటివ్ గా కనిపించేది.
👉ఇప్పుడు 20 మంది పిల్లల్లో పాజిటివ్ గా తేలుతోంది. అంటే 20 రెట్లు పెరిగిందన్నమాట. ప్రస్తుతం 6-15 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
👉నెలల పిల్లల్లోనే కాదు, అప్పుడే పుట్టిన పిల్లల్లోనూ దీన్ని చూస్తున్నాం.
💥దీనికి కారణమేంటి? 💥
👉కొవిడ్-19 నివారణ పట్ల నిర్లక్ష్యం చూపటం. మొదట్లో మాస్కులు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, చేతులు కడుక్కోవటం వంటి జాగ్రత్తలు బాగానే పాటించారు.
👉రాన్రాను కేసులు తగ్గటం, అంత ఉద్ధృతంగా దాడి చేయకపోవటం వల్ల 'ఇదేం చేస్తుందిలే' అనే భావన నెలకొనటమే ఇప్పుడు కొంప ముంచుతోంది.
తొలిదశలో కరోనా జబ్బు పిల్లలకు అంతగా సోకకపోవటం, సోకినా లక్షణాలేవీ లేకుండానే సురక్షితంగా బయటపడటం కూడా కొంత ధైర్యం కలిగించింది.
👉ఇవన్నీ ఒకరకంగా నిర్లక్ష్యానికే దారితీశాయి. ఇదే మలిదశలో వైరస్ విస్తృతంగా దాడి చేయటానికి, పిల్లలకూ హానికరంగా పరిణమించటానికి వీలు కల్పిస్తోంది.
👉మరో ముఖ్య కారణం- సార్స్-కోవీ 2 కొత్త రూపు సంతరించుకోవటం. వైరస్ తన మనుగడ కోసం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అది దాని సహజ గుణం, సాధారణంగా 95% మార్పులు పెద్దగా హాని కలిగించవు.
👉ఏస్-2 గ్రాహకాలతో అంటుకునేలా చేసే మార్పులే ఇప్పుడు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. బి.1.187 రకం వైరస్లో జరుగుతోంది. ఇదే.
💥గాలి ద్వారా వ్యాపించటంతోనూ..💥
👉ఇంతకుముందు వైరస్ పెద్ద తుంపర్లతోనే వ్యాపిస్తుందని, ఇతరులకు 6 మీటర్ల దూరంలో ఉంటే సురక్షితమని భావించేవారు.
👉కానీ కరోనా వైరస్ సూక్ష్మ తుంపర్లతోనూ.. అంటే మాట్లాడినప్పుడు, శ్వాస వదిలినప్పుడు బయటకు వచ్చే కంటికి కనిపించని తుంపర్లతోనూ వ్యాపిస్తున్నట్టు లాన్సెట్ వైద్య పత్రికలో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ఇలాంటి సూక్ష్మ తుంపర్లు గాలిలో చాలా సేపు తేలియాడగలవు.
👉ఇలా ఇది గాలి ద్వారానూ వ్యాపిస్తోందన్నమాట. పిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్లకపోయినా కూడా కరోనా సోకుతుండటానికి కారణమిదే.
👉రకరకాల పనుల మీద బయటకు వెళ్లి వచ్చే పెద్దవాళ్ల ద్వారా పిల్లలకు అంటుకుంటోంది.
👉వైరస్ సోకినా అందరిలో అన్నిసార్లూ లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి వాళ్లు వదిలే శ్వాస ద్వారా పిల్లలకు సోకుతోందని గుర్తించటం అవసరం.
👉 కాబట్టే రెండో దశలో కరోనా వైరస్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
💥 ఎక్కడి పిల్లలు అక్కడే💥
👉మొదట్లో పిల్లల నుంచి పెద్దవాళ్లకు వైరస్ అంతగా వ్యాపించదనే భావించేవారు.
👉కానీ పిల్లల ద్వారానూ ఎక్కువగానే ఇతరులకు సోకుతున్నట్టు ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి.
👉పిల్లల గొంతు, ముక్కులో అంత ఎక్కువగా వైరస్ లేకపోవచ్చు. లక్షణాలు లేకపోవచ్చు. అలాగని ఇతరులకు వైరస్ సోకదని అనుకోవటానికి లేదు. లక్షణాల తీవ్రతకు వైరస్ సంఖ్యకు సంబంధం లేదు.
👉లక్షణాలు కనిపించనంత మాత్రాన పిల్లల్లో వైరస్ లేదనుకోవద్దు. లక్షణాలున్నా లేకపోయినా వైరసను వ్యాపింపజేసే అవకాశముంది.
👉పిల్లలు ఒకదగ్గర కుదురుగా కూర్చోరు. అందరి దగ్గరికి వెళ్తుంటారు. అందువల్ల వైరసను మరింత త్వరగా, ఎక్కువగా వ్యాపింపజేసే ప్రమాదమూ ఉంది.
👉ప్రస్తుతం గాలి ద్వారా వ్యాపిస్తుండటం వల్ల ఇంట్లో పెద్దవాళ్ల నుంచైనా, బయట ఇతర పిల్లల నుంచైనా ఎక్కడ్నుంచైనా వైరస్ అంటుకునే అవకాశముందని గుర్తించాలి.
👉చాలామంది చేస్తున్న పొరపాటు ఇంట్లో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపించగానే పిల్లలను ఊళ్లకు పంపించేయటం. ఇది మంచి పద్ధతి కాదు.
👉ఇంట్లో ఒకరికి కొవిడ్ వచ్చినా, కొవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించినా అందరికీ జబ్బు వచ్చినట్టుగానే పరిగణించాలి.
👉పిల్లలను ఊళ్లకు పంపిస్తే అక్కడి వాళ్లకూ వైరస్ అంటుకునే అవకాశముంది.
👉కాబట్టి ఎక్కడి పిల్లలను అక్కడే ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో వాళ్లంతా విధిగా సర్జికల్ మాస్కులు ధరించాలి.
👉ఎత్తుకోవటం, ముద్దు పెట్టుకోవటం వంటివేవీ చేయొద్దు.
💥ప్రమాదం ఎవరికి ఎక్కువ? 💥
👉దీర్ఘకాల కిడ్నీ జబ్బు, కాలేయ జబ్బు, పుట్టుకతో గుండె లోపాలతో బాధపడేవారు...
👉క్యాన్సర్ బాధితులు, రోగనిరోధక శక్తి తక్కువగా గలవారు, మతి స్థిమితం లేనివారు, టైప్ 1 మధుమేహులు, తీవ్రమైన ఊబకాయం, పోషణలోపం గలవారికి కొవిడ్-19 వస్తే వేగంగా విషమించే ప్రమాదముంటోంది.
👉కాబట్టి వీరి విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.
🔥మూడు రకాలు 🔥
పిల్లల్లో లక్షణాలను బట్టి కరోనా జబ్బును మూడు రకాలుగా విభజించుకోవచ్చు.
💥మామూలు:
👉సాధారణ శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ లక్షణాలను మామూలు జబ్బుగా భావించొచ్చు. వీరిలో కొద్దిగా జ్వరం, గొంతునొప్పి, ముక్కు కారటం, దగ్గు.. అలాగే విరేచనాలు, వాంతి, నలతగా ఉండటం కనిపిస్తుంటాయి. ఆయాసం ఉండదు.
💥ఒక మాదిరి:
👉జబ్బు ముదురుతున్న కొద్దీ శ్వాస వేగంగా తీసుకోవటం మొదలవుతుంది. ఈ దశలో కొందరికి రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కన్నా తక్కువకు పడిపోవచ్చు. కొందరిలో న్యుమోనియా ఆరంభం కావొచ్చు.
💥తీవ్రం, విషమం:
👉తీవ్ర దశలో న్యుమోనియా ఎక్కువవుతుంది. ఆక్సిజన్ శాతం 90 కన్నా పడిపోవచ్చు.
👉శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి కావటం, డొక్కలు ఎగరేయటం వంటివీ ఉండొచ్చు.
👉ఇలాంటి సమయంలో బయటి నుంచి ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది.
👉సమస్య ఇంకా తీవ్రమవుతున్న కొద్దీ నిస్సత్తువ, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక మత్తుగా నిద్రపోవటంతో పాటు కొందరికి మూర్ఛ. తలెతొచ్చు.
👉విడవకుండా విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి సైతం వేధించొచ్చు. సమస్య మరీ విషమిస్తే- శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, షాక్ లోకి వెళ్లిపోవటం..
👉కిడ్నీ, కాలేయం వంటి అవయవాలు విఫలం కావటం, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు ఏర్పడటం వంటివి తలెత్తుతాయి.
👉వీరిని అత్యవసర విభాగంలో చేర్చి, వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది.
ఎప్పుడు అనుమానించాలి?
ఆరేళ్లు దాటిన పిల్లల్లో పెద్దవాళ్లలో మాదిరి లక్షణాలే కనిపించినప్పటికీ కొన్నిసార్లు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు. మామూలు జలుబు, వైరల్ జబ్బులాగా అనిపించొచ్చు. చాలామంది పిల్లలు ఒకట్రెండు వారాల్లో వీటి నుంచి కోలుకుంటారు. అయినా ఆయా లక్షణాల గురించి తెలుసుకొని ఉండటం మంచిది. ప్రధానమైన లక్షణాలు ఇవీ..
జ్వరం
చలి ఉండొచ్చు/లేకపోవచ్చు.
నిస్సత్తువ, అలసట
తలనొప్పి, ఒళ్లు నొప్పులు
ముక్కుదిబ్బడ, దగ్గు, గొంతునొప్పి
• శ్వాస వేగంగా తీసుకోవటం
* వికారం, వాంతి, విరేచనాలు
* విడవకుండా కడుపునొప్పి ܀
ఆహారం సరిగా తినకపోవటం, ఆకలి లేకపోవటం.. రుచి, వాసన తగ్గటం.
💥చికిత్స - లక్షణాలను బట్టి
👉మామూలు జబ్బుకు పిల్లలకు ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదు. మంచి ఆహారం తినేలా, తగినంత నీరు తాగేలా, విశ్రాంతి తీసుకునేలా చూసుకుంటే చాలు.
👉అవసరమైతే ఆయా లక్షణాలను పారాసిటమాల్, మందు, గొంతునొప్పికి ఉప్పునీరు పుక్కిలించటం,
👉కడుపునొప్పి, విరేచనాలకు తగు మందులు అవసరమవుతాయి.
👉పెద్దవాళ్ల మాదిరిగా వీరికి యాంటీబయోటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండు, మూడు రోజులు దాటినా జ్వరం తగ్గకుండా, ఇంకా ఎక్కువవుతూ వస్తున్నప్పుడే యాంటీబయోటిక్స్ ఆరంభించాలి.
👉అదీ రక్త పరీక్ష చేసి, సీఆర్‌పీ వంటివి ఎక్కువగా ఉంటేనే వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.
👉ఒక మాదిరి, తీవ్ర జబ్బు గలవారిని ఆసు చేర్చి చికిత్స చేయాల్సి ఉంటుంది. వీరికి బయ నుంచి ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది.
అవసరా తగు ఇంజెక్షన్లు, స్టిరాయిడ్లు, ఇమ్యునోగ్లోబులినా సెలైన్ ఇస్తారు. పిల్లలకు రెమ్ డెసివిర్, టొసిలి లాంటి ఇంజెక్షన్ల అవసరం చాలా అరుదు. ఏ విషయంలో గాబరా పడొద్దు.