OMR షీట్ల బబ్లింగ్ వివాదం పై హైకోర్టు తీర్పు
👉TSPSC నిర్వహించిన వివిధ ఉద్యోగ నియామకాల పరీక్షల్లో ఓఎంఆర్ షీట్ల బబ్లింగ్ వివాదంపై ఇవ్వాళ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
👉తీర్పులో బబ్లింగ్ లో తప్పులు చేసినటువంటి అభ్యర్థుల సమాధాన పత్రాలు వద్దని, ఆ సమాధాన పత్రాలను ఎట్టిపరిస్థితుల్లోను అనుమతించవద్దని హైకోర్టు ఆదేశించింది.
👉ఓఎంఆర్ షీట్ ల వివరాలు జాగ్రత్తగా నింపాల్సిన బాధ్యత అభ్యర్థులదేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
👉కోర్టు కేసుల కారణంగా ఆగిన నియామకాలను తక్షణమే భర్తీ చేయాలని టిఎస్పిఎస్సి ని ఆదేశించింది.
👉ఈ సందర్భంగా టిఎస్పిఎస్సి న్యాయవాది బాలకిషన్ రావ్ కోర్టు కేసుల కారణంగా 40 నుంచి 60 కోట్ల దాకా భర్తీ కాకుండా మిగిలిపోయాయని చెప్పారు.
👉టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ టు పరీక్షలో కొందరు అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ వైట్ నర్ ఉపయోగించడం జరిగిందని
అభ్యర్థులు తెలియక తప్పు చేశామని వాదించారు.
👉 కొంతమంది ఇన్విజిలేటర్లు కూడా అవగాహన లేకుండా అనుమతించారని టిఎస్పిఎస్సి వాదించింది. ప్రస్తుతం ఈ కోర్టు తీర్పుతో ఈ వివాదం సద్దుమణిగింది.
0 Comments